logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

టాలీవుడ్ ప్రముఖులపై తేజస్వి మడివాడ సంచలన వ్యాఖ్యలు

2016 లో సినీ పరిశ్రమలో మొదలైన ‘మీటూ’ ఉద్యమం సెగలు ఇంకా చల్లారలేదు. ఈ ఉదంతంతో ఎంతో మంది సినీ, వ్యాపార, క్రీడాకారుల జీవితాలు చీకట్లోకి వెళ్లిపోయాయి. తమకు ఎదురైనా వేధింపుల గురించి ఒక్కొక్కరుగా మహిళలు బయటకు చెప్పడంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. ఇప్పటికే కొందరు ప్రముఖులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మరికొందరు సమాజంలో తలెత్తుకోలేక అజ్ఞాతంలోకి వెళ్లారు.

అదే తరహాలో తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ వివాదంపై పెద్ద దుమారమే రేగింది. కొందరు నటీమణులు, జూనియర్ ఆర్టిస్టులు తాము కాస్టింగ్ కౌచ్ బాధితులమని ముందుకొచ్చారు. ఇప్పుడిప్పుడే ఈ విషయాన్నీ అందరూ మర్చిపోతుండగా తాజాగా బిగ్ బాస్ నటి తేజస్వి మడివాడ టాలీవుడ్ పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

టాలీవుడ్ లో 90 శాతం కాస్టింగ్ కౌచ్ ఉందని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతే కాదు పరిశ్రమకు వచ్చేవారంతా కాస్టింగ్ కౌచ్ కు సిద్దపడే వస్తున్నారని.. వారికి ఇప్పుడు సినిమా అవకాశాలకు కొదువలేదని చెప్పింది. అయితే గతంలో తాను కూడా ఈ వేధింపులు ఎదుర్కొన్నానని తెలిపింది. చాలా మంది ప్రముఖులు తనను ఆ ఫెవర్ అడిగారని అందుకు తాను ఒప్పుకోకపోవడం వల్లనే తాను ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోయానని తెలిపింది.

తనలా అందరు ఈ విషయాన్నీ బయటకు చెప్పుకోరని తెలిపింది. కానీ ముంబై నుంచి వచ్చే హీరోయిన్లు దేనికైనా సిద్ధంగా ఉంటారని చెప్పి బాంబు పేల్చింది తేజస్వి. కాస్టింగ్ కౌచ్ కు సిద్దపడే వారికి అవకాశాలు ఇవ్వడానికి సినీ పరిశ్రమలో చాలా మందే ఉన్నారని తేజస్వి చేసిన కామెంట్లు ఇప్పుడు సంచలనంగా మారాయి.

Related News