logo

  BREAKING NEWS

అమిత్ షా వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్!  |   ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తేనే కదా తెలిసేది: కేసీఆర్ పై అమిత్ షా  |   వ్యాయామం ఏ వయసు వారు ఎంతసేవు చేయాలి: డబ్ల్యూహెచ్వో మార్గదర్శకాలు  |   బ్రేకింగ్: మంత్రి పేర్ని నానిపై హ‌త్యాయ‌త్నం  |   తెలంగాణలో కరోనా అప్ డేట్.. కొత్తగా నమోదైన కేసులు ఎన్నంటే?  |   ‘సర్జికల్ స్ట్రయిక్స్’ అంటే ఏమిటి? ఎలాంటి సందర్భాలలో నిర్వహిస్తారు?  |   బీజేపీ పార్టీలోకి తెలంగాణ ఫైర్ బ్రాండ్?… క్లారిటీ వచ్చేసింది!  |   మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్: చరిత్ర మరువని రియల్ హీరో స్టోరీ!  |   8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |  

పుట్టినరోజు వేడుకల్లో అపశ్రుతి.. ఆ ఊరంతా విషాదం

స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలు ఓ ఊరు మొత్తాన్ని విషాదంలో నింపాయి. సరదా కోసం ఈతకు దిగిన నలుగురు యువకులు గోదావరిలో శవాలై తేలిన ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. ములుగు జిల్లాలో వెంకటాపురం మండలం మరికాల గోదావరి రేవు వద్ద తమ స్నేహితుడి పుట్టిన రోజు వేడుకల కోసం 16 మంది కలిసి హాజరయ్యారు.

ఆ రోజంతా అక్కడే ఉండి వంట చేసుకుని తిన్నారు. కేక్ కటింగ్ కూడా చేసారు. ఆ తర్వాత పక్కనే ఉన్న గోదావరిలోకి ఈత కోసం దిగారు. ఇంతలోనే విషాదం చోటుచేసుకుంది. ఈతకు దిగిన 16 మందిలో తుమ్మ కార్తిక్(21), అన్వేష్(23), శ్రీకాంత్(21), రాయవరపు ప్రకాష్(23) అనే యువకులు నీటిలో గల్లంతయ్యారు.

శనివారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటనలో రాయవరపు ప్రకాశ్‌, తుమ్మ కార్తీక్‌ మృతదేహాలు లభ్యం కాగా అప్పటికే చీకటి పడింది. దీంతో ఆదివారం ఉదయం మరోసారి యువకుల కోసం గాలించగా మరో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులంతా ఒకే ఊరి వారు కావడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Related News