logo

  BREAKING NEWS

‘దమ్ముంటే కూల్చరా’.. అక్బరుద్దీన్ కు బండి సంజయ్ సవాల్!  |   మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |   కరోనా సెకండ్ వేవ్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!  |   మహిళల భద్రతకు ‘అభయం’ యాప్.. ఎలా పనిచేస్తుంది? ప్రత్యేకతలేమిటి?  |   తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకుందాం: కేసీఆర్  |   హైద్రాబాదులో గుంతలు లేని రోడ్డు చూపిస్తే రూ. లక్ష..!  |   భాగ్యనగరవాసులకు అలెర్ట్: ముంచుకొస్తున్న భారీ ముప్పు!  |   జీహెచ్ఎంసీ ఎన్నికలపై పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన..!  |   శత్రుదేశాలకు నిద్రలేకుండా చేసే చైనా రహస్యం.. ‘ఐదు వేళ్ళ వ్యూహం’ గురించి తెలుసా?  |   హైదరాబాద్ పాత బస్తీలో హైటెన్షన్.. భారీగా పోలీసుల బందోబస్తు!  |  

‘విమానం రెండు ముక్కలవడం చూసి భయపడ్డా..’

కేరళ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘోర విమాన ప్రమాదంపై భారత క్రికెటర్లు దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. నిన్న రాత్రి దుబాయ్ నుంచి కోజికోడ్ కు వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం కరిపూర్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో రన్ వేపై జారి రెండుముక్కలైంది. ఇప్పటివరకు ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 19 కి చేరుకుంది.

ఈ విమానంలో పైలట్లతో సహా ఆమొత్తం 191 మంది ఉన్నట్టుగా గుర్తించారు. క్షతగాత్రులైన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద సహాయక చర్యల్లో పాల్గొన్న వారందరినీ ప్రస్తుతం ఐసోలేషన్ కు తరలించారు. కాగా దీనిపై భారత క్రికెటర్లు స్పందిస్తూ.. ఈ దుర్ఘటనలో గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరణించిన వారి కుటుంబాలకు సానుభూతిని వ్యక్తం చేసారు.

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ ప్రమాదం పై స్పందిస్తూ.. ‘కోజికోడ్‌లో విమాన ప్రమాదానికి గురైన వారి కోసం ప్రార్థనలు చేస్తున్నాను. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం’ అని ట్వీట్ చేసారు.

‘ఈ వార్త నన్ను దిగ్బ్రాంతికి గురి చేసింది. ప్రమాదానికి గురైన వారంతా త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను. 2020 ఇకనైనా మమ్మల్ని కనికరించు’ అని యువరాజ్ తెలిపాడు.

‘కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో రన్‌వేపై ఓవర్‌షాట్ చేసిన ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో గాయపడినవారు కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఈ ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను’ అని సచిన్ ట్వీట్ చేసారు.

‘కోజికోడ్ నుంచి భయంకర వార్త తెలిసింది. ప్రమాదంలో గాయపడిన వారంతా క్షేమమగా ఉండాలని ప్రార్థిస్తున్నా.. విమానం రెండు ముక్కలవడం చూసి భయమేసింది’ అని గౌతమ్ గంభీర్ ట్వీట్ చేసారు.

Related News