logo

  BREAKING NEWS

కరోనా వ్యాప్తి: కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం!  |   హైదరాబాద్ పరిధిలో ఈ పది డివిజన్లే ‘కరోనా’ డేంజర్ జోన్లు!  |   బ్రేకింగ్: సచివాలయం కూల్చివేత పై ప్రభుత్వానికి హైకోర్టు షాక్!  |   బ్రేకింగ్: కంటైన్మెంట్ జోన్ గా తిరుమల  |   గాంధీ కుటంబానికి ఊహించని షాకిచ్చిన కేంద్రం..!  |   ప్రపంచాన్ని వణికిస్తున్న ‘బుబోనిక్ ప్లేగు’.. ఇది కరోనా కన్నా డేంజర్!  |   గాల్వన్ లోయ నుంచి చైనా వెనక్కి.. డ్రాగన్ ను నమ్మలేమంటున్న భారత్  |   చైనాతో యుద్ధం.. భారత్ కు మద్దతుగా నిలుస్తున్న దేశాలు ఇవే!  |   హైదరాబాద్ లో మళ్ళీ లాక్ డౌన్ లేనట్టే.. కారణం ఇదే!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇవాళ భారీగా న‌మోదైన క‌రోనా కేసులు  |  

తెలంగాణ సర్కార్ సీరియస్.. కరోనా పరీక్షలకు బ్రేక్!

తెలంగాణలో కరోనా పరీక్షలను నిలిపివేశారు. రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత అధికంగా ఉండటంతో వారం రోజుల క్రితమే ప్రైవేటు ల్యాబుల్లో కరోనా పరీక్షలకు ప్రభుత్వం అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలు కరోనా భయంతో భారీగా టెస్టుల కోసం వస్తున్నారు. ఎలాంటి లక్షణాలు, ట్రావెల్ హిస్టరీ లేకపోయినా పరీక్షలు జరిపించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కరోనా టెస్టుల రిపోర్టులు రావడం ఆలస్యం అవుతుంది. ఇది ప్రజల్లో అనవసర భయాలకు దారి తీస్తుంది.

కాగా ప్రభుత్వ ఆసుపత్రులు కరోనా పై వ్యవహరిస్తున్న తీరుపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కరోనాతో ప్రైవేటు ఆసుపత్రులు వ్యాపారం చేయవద్దంటూ ఇటీవల హెచ్చరికలు కూడా జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రైవేటు ల్యాబులు మాత్రం ప్రభుత్వం నిర్ణయించిన ధరల కన్నా అధిక ధరలకు పరీక్షలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రైవేటు ల్యాబుల్లో పరీక్షల తీరును పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఒక కమిటీని కూడా నిర్వహించింది. తాజాగా ఈ కమిటీ ప్రభుత్వానికి అందించిన నివేదికలో ఆందోళనకలిగించే విషయాలు వెల్లడించింది. అంతే కాదు ఐసిఎంఆర్ నిబంధనలు కూడా పాటించడం లేదని తెలుస్తుంది. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను కూడా లెక్కచేయకుండా ప్రైవేటు ల్యాబుల్లో ఎలాంటి కరోనా పద్దతులను కూడా పాటించడం లేదని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఈ విషయాన్నీ వైద్య ఆరోగ్య శాఖా కూడా వెల్లడించింది. దీంతో నిబంధనలను అతిక్రమించిన అన్ని ప్రైవేటు ల్యాబుల్లో రెండు రోజుల పాటు పరీక్షలను ఆపాలని ప్రభుత్వం ఆదేశించింది.

Related News