logo

  BREAKING NEWS

బ‌జాజ్ చేత‌క్ మ‌ళ్లీ వ‌చ్చేసింది.. ధ‌ర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు  |   హ‌మ్మ‌య్య‌… ఆ వ్యాక్సిన్‌లు కూడా వ‌చ్చేస్తున్నాయి  |   మీ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందా? మీ డేటా ఎక్కడైనా లీక్ అయ్యిందా? ఇలా తెలుసుకోండి  |   తగ్గిన బంగారం ధరలు 14.04. 2021 నాటి బంగారం, వెండి ధరలు  |   మళ్ళీ పెరిగిన బంగారం ధరలు 13.04.2021 నాటి బంగారం, వెండి ధరలు  |   శుభవార్త: భారత్ లో మరో వాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్!  |   కరోనా సెకండ్ వేవ్: ఎక్కువ మందిలో బయటపడుతున్న లక్షణం ఇదే  |   బ‌ట్ట‌లు లేకుండా అమ్మాయిలు వీడియో కాల్ చేస్తారు టెంప్ట్ అయితే మీ ప‌ని ఖ‌తం  |   హలీమ్ తింటే బరువు పెరుగుతారా?  |   ఆ నాలుగు ప్రాంతాల్లోనే కుంభమేళా ఎందుకు? కోట్ల ఖర్చుతో ఎందుకు నిర్వహిస్తారు?  |  

నిరుద్యోగులకు శుభవార్త: 3479 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్.. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం!

నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. తాజాగా కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ భారీగా టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న ఉన్న 3479 పోస్టుల నియామకాలు చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా వైస్ ప్రిన్సిపాల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, ట్రైన్డ్ టీచర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్లోతెలిపిన విధంగా తెలంగాణ రాష్ట్రంలో 262, ఆంధ్రప్రదేశ్ లో 117 పోస్టులు ఉన్నాయి. 3479 ఖాళీలు ఉండగా అందులో ప్రిన్సిపాల్- 175, వైస్ ప్రిన్సిపాల్- 116, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్- 1244, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్- 1944 పోస్టులున్నాయి.

విద్యార్హతల విషయానికొస్తే.. ప్రిన్సిపాల్ పోస్టుకు ఏదైనా స్కూలింగ్ సబ్జెక్ట్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పాస్ కావాలి. లేదా టీచింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేసి ఉండాలి. 10 ఏళ్లు ఇంగ్లీష్ మీడియం హయ్యర్ సెకండరీ స్కూల్ టీచర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. టీజీటీ, పీజీటీ పోస్టుకు మాస్టర్స్ డిగ్రీతో పాటు బీఈడీ పాస్ కావాలి.

2021 ఏప్రిల్ 1వ తేదీ నుంచి వీటికి సంబందించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. అయితే అధికారిక వెబ్ సైట్ ను మాత్రమే అభ్యర్థులు అనుసరించవలసి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే ముందు నోటిఫికేషన్ ను పూర్తిగా చదవి అప్లై చేసుకోవాలి. 2021 ఏప్రిల్ 30 తేదీ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జూన్ మొదటి వారంలో పరీక్ష ఉంటుంది. ఆసక్తి ఉన్న భ్యర్థులు పైన తెలిపిన అర్హతల ప్రకారం ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

దేశ వ్యాప్తంగా ఉన్న ఖాళీల పోస్టుల వివరాల ను ఒకసారి పరిశీలిస్తే..

హిమాచల్ ప్రదేశ్- 8
ఝార్ఖండ్- 208
జమ్మూ అండ్ కాశ్మీర్- 14
మధ్య ప్రదేశ్- 1279
మహారాష్ట్ర- 216
మణిపూర్- 40
మిజోరం- 10
ఒడిశా- 144
రాజస్తాన్- 316
సిక్కిం- 44
త్రిపుర- 58
ఉత్తర్ ప్రదేశ్- 79
ఉత్తరాఖండ్- 9
తెలంగాణ- 262
ఆంధ్ర ప్రదేశ్- 117
చత్తీస్‌గఢ్- 514
గుజరాత్లో – 161 పోస్టులు ఉన్నాయి.

Related News