logo

  BREAKING NEWS

అమిత్ షా వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్!  |   ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తేనే కదా తెలిసేది: కేసీఆర్ పై అమిత్ షా  |   వ్యాయామం ఏ వయసు వారు ఎంతసేవు చేయాలి: డబ్ల్యూహెచ్వో మార్గదర్శకాలు  |   బ్రేకింగ్: మంత్రి పేర్ని నానిపై హ‌త్యాయ‌త్నం  |   తెలంగాణలో కరోనా అప్ డేట్.. కొత్తగా నమోదైన కేసులు ఎన్నంటే?  |   ‘సర్జికల్ స్ట్రయిక్స్’ అంటే ఏమిటి? ఎలాంటి సందర్భాలలో నిర్వహిస్తారు?  |   బీజేపీ పార్టీలోకి తెలంగాణ ఫైర్ బ్రాండ్?… క్లారిటీ వచ్చేసింది!  |   మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్: చరిత్ర మరువని రియల్ హీరో స్టోరీ!  |   8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |  

బిగ్ బ్రేకింగ్‌: రెండు రాష్ట్రాల‌కు టీడీపీ అధ్య‌క్షుల నియామ‌కం

తెలుగుదేశం పార్టీ క‌మిటీల‌ను ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క‌టించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షులుగా మాజీ మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడును నియ‌మించారు. తెలంగాణ టీడీపీ అధ్య‌క్షుడిగా ప్ర‌స్తుత అధ్య‌క్షుడు ఎల్‌.ర‌మ‌ణ‌ను కొన‌సాగిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. గ‌త కొన్నాళ్లుగా టీడీపీ రెండు రాష్ట్రాల అధ్య‌క్షుల నియామ‌కంపై చంద్ర‌బాబు క‌స‌ర‌త్తు చేస్తున్నారు.

ఏపీ టీడీపీ అధ్య‌క్ష ప‌ద‌వికి సంబంధించి అచ్చెన్నాయుడుతో పాటు మ‌రికొంద‌రి పేర్ల‌ను ప‌రిశీలించారు. చివ‌ర‌కు అచ్చెన్నాయుడు వైపే చంద్ర‌బాబు మొగ్గు చూపారు. దివంగ‌త ఎర్ర‌న్నాయుడు కుటుంబం టీడీపీకి విశ్వాసంగా ప‌ని చేస్తోంది. అచ్చెన్నాయుడు అసెంబ్లీలో, బ‌య‌ట ప్ర‌భుత్వాన్ని ఎదుర్కోవ‌డంలో ముందుంటున్నారు. ఆయ‌న బీసీ సామాజ‌క‌వ‌ర్గానికి చెందిన నేత‌. ఉత్త‌రాంధ్ర‌లో కీల‌క నాయ‌కులు. ఈ ఈక్వేష‌న్లు అన్ని ప‌రిశీలించిన త‌ర్వాత అచ్చెన్నాయుడు నియామ‌కాన్ని చంద్ర‌బాబు ఖాయం చేశారు.

తెలంగాణ టీడీపీ అధ్య‌క్షుడిగా ఎల్‌.ర‌మ‌ణ‌ను మ‌రోసారి కొన‌సాగించాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించారు. ఇటీవ‌ల ఎల్‌.ర‌మ‌ణ‌ను తొల‌గించి మ‌రొక‌రిని ఈ ప‌ద‌విలో నియ‌మించాల‌ని ప‌లువురు టీటీడీపీ నేత‌లు చంద్ర‌బాబు నాయుడును కోరారు. కానీ, ఎల్‌.ర‌మ‌ణ బీసీ సామాజ‌క‌వ‌ర్గ నేత‌. పార్టీ బ‌ల‌హీనంగా ఉన్నా ఇంత‌కాలంగా భుజాన మోస్తున్నారు. అందుకే మ‌రోసారి ఎల్‌.ర‌మ‌ణ వైపు చంద్ర‌బాబు మొగ్గు చూపారు.

Related News