ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా టీడీపీ కీలక నిర్ణయం ప్రకటించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వడానికి టీడీపీ సిద్ధమైంది. 3వ తేదీన జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పెన్షన్లకు సంబందించి సీఎం జగన్ తప్పుడు సమాచారం ఇచ్చారని టీడీపీ చెప్తుంది.
అక్టోబర్ 2018 నాటికి గత ప్రభుత్వం మంజూరు చేసిన పెన్షన్ల విషయంలో తప్పుడు వివరాలు ఇచ్చి సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. సీఎం పై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని ఈమేరకు సభాపతి తమ్మినేని సీతారాంని కలిసి నోటీసులు ఇవ్వనున్నట్టుగా టీడీపీ ప్రకటించింది. కాగా నిన్నటి అసెంబ్లీ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ జగన్ ఆయనపై ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.