logo

  BREAKING NEWS

8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |   బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల: గ్రేటర్ ప్రజలపై వరాల జల్లు!  |   ఎడ‌మ చేతివాటం ఎందుకు వ‌స్తుంది ? వారిలో తేడా ఏముంటుంది ?  |   ఏబీ వెంకటేశ్వర్ రావుకు సుప్రీంలో షాక్..!  |   జ‌గ‌న‌న్న తోడు.. పేద‌ల‌కు రూ.10 వేలు.. ఇలా పొందాలి  |   ‘దమ్ముంటే కూల్చరా’.. అక్బరుద్దీన్ కు బండి సంజయ్ సవాల్!  |   మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |   కరోనా సెకండ్ వేవ్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!  |   మహిళల భద్రతకు ‘అభయం’ యాప్.. ఎలా పనిచేస్తుంది? ప్రత్యేకతలేమిటి?  |  

టీడీపీ నేత ఆస్తుల వేలానికి రంగం సిద్ధం.. ఎగ్గొట్టిన రుణం ఎంతంటే?

మాజీ మంత్రి , టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కు పేరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇండియన్ బ్యాంకుకు అప్పుల ఎగవేత వ్యవహారంలో ఇండియన్ బ్యాంకు ఆగ్రహంవ్యక్తం చేసింది. ఇప్పుడు ఆయన ఆస్తులను వేలం వేసేందుకు సిద్ధమైంది. విశాఖతో పాటుగా ఇతర ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను వేలం వేయనున్నారు.

ఒకప్పటి గంటా మానస పుత్రిక ప్రత్యూష పేరు మీదగా స్థాపించిన ప్రత్యూష రిసోర్సెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా సంస్థ ఇండియా బ్యాంకుకు రూ. 141.68 కోట్ల రూపాయలు బాకీ పడింది. ఆ తర్వాత ఈ అప్పు వడ్డీతో కలిపి 248.03 కోట్లకు చేరుకుంది. దీంతో ఈ నెల 25న గంటా ఆస్తులను వేలం వేసేందుకు హైదరాబాద్ లో గల ఇండియన్ బ్యాంకు ఈ యాక్షన్ సేల్ ను జారీ చేసింది.

ఈ రుణాలకు బాధ్యులుగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు పీవీ ప్రభాకరరావు, పీవీ భాస్కరరావు, నార్ని అమూల్య, పి.రాజారావు, కేబీ సుబ్రహ్మణ్యం, ప్రత్యూష రిసోర్సెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా, ప్రత్యూష గ్లోబల్‌ ట్రేడ్‌ లిమిటెడ్‌ సంస్థలను కూడా ఇండియన్‌ బ్యాంకు నోటిఫై చేసింది. కాగాఈ సంస్థ డైరెక్టర్ పదవి నుంచి తాను 2011 లోనే తప్పుకున్నానని ఈ ఆస్తులతో తనకు ఎలాంటి సంబంధం లేదని గంటా ఇదివరకే ప్రకటించారు.

Related News