శాసన సభ మాజీ స్పీకర్, దివంగత నేత కోడెల శివప్రసాద రావు తనయుడు కోడెల శివరాం పై పోలీసులకు ఫిర్యాదు అందింది. గుంటూరు జిల్లా రాజుపాలెం, గణపవరం గ్రామానికి చెందిన టీడీపీ నేత నర్రా రమేష్ రావు శివరాం పై పోలీసులను ఆశ్రయించారు. టీడీపీ హయాంలో నారా రమేష్ రావు లిక్కర్ వ్యాపారం చేసేవారు.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కోడెల శివప్రసాదరావు సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసారు. ఈ సందర్భంగా శివరాం మద్యం పంపిణీ కోసం రూ.1.30 కోట్ల లిక్కర్ తీసుకున్నాడని తిరిగి డబ్బులు చెల్లించాలని అడిగితే చంపేస్తానని బెదిరిస్తున్నారన్నారు. 2015 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న సమయంలో మద్యం వ్యాపారుల దగ్గర అనధికారికంగా భారీగా డబ్బులు దండుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
శివరాం వేధింపులు భరించలేక పోలీసులను ఆశ్రయించినట్టుగా తెలిపారు. కాగా ఈ ఫిర్యాదుపై పోలీసులు స్పందించాల్సి ఉంది. గతంలో కోడెల కుమారుడు శివరాంతో పాటుగా కుమార్తె కూడా అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. తాజాగా సొంత పార్టీకి చేందిన నేతే అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది.