logo

  BREAKING NEWS

కరోనా వ్యాప్తి: కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం!  |   హైదరాబాద్ పరిధిలో ఈ పది డివిజన్లే ‘కరోనా’ డేంజర్ జోన్లు!  |   బ్రేకింగ్: సచివాలయం కూల్చివేత పై ప్రభుత్వానికి హైకోర్టు షాక్!  |   బ్రేకింగ్: కంటైన్మెంట్ జోన్ గా తిరుమల  |   గాంధీ కుటంబానికి ఊహించని షాకిచ్చిన కేంద్రం..!  |   ప్రపంచాన్ని వణికిస్తున్న ‘బుబోనిక్ ప్లేగు’.. ఇది కరోనా కన్నా డేంజర్!  |   గాల్వన్ లోయ నుంచి చైనా వెనక్కి.. డ్రాగన్ ను నమ్మలేమంటున్న భారత్  |   చైనాతో యుద్ధం.. భారత్ కు మద్దతుగా నిలుస్తున్న దేశాలు ఇవే!  |   హైదరాబాద్ లో మళ్ళీ లాక్ డౌన్ లేనట్టే.. కారణం ఇదే!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇవాళ భారీగా న‌మోదైన క‌రోనా కేసులు  |  

నా హత్యకు సుపారీ ఇచ్చారు.. సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు

అఖిల ప్రియ దంపతులపై టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అఖిల ప్రియ దంపతులు తనను చంపడానికి కోటి రూపాయల సుపారీ ఇచ్చారని అన్నారు. తనపై దాడి జరిగినప్పటి నుండి తాను మౌనంగానే ఉన్నానని పోలీసుల ద్వారా ఈ విషయం తెలుసుకుని షాకయ్యానన్నారు. ఆనాడు కడప పోలీసులు లేకుంటే తనను హత్య చేసేవారన్నారు.

‘ఆమెపై నేను ఫిర్యాదు చేయలేదు. నా ఆరోపణలకు సమాధానం చెప్పకుండా అఖిల ప్రియ నన్ను ఆళ్ళ గడ్డకు రమ్మంటుంది. ఆమె నాకు రాజకీయం నేర్పుతుందా ‘అని అయన ప్రశ్నించారు. హత్యాయత్నం కేసులో అఖిల ప్రియా ముద్దాయా కదా? అని ఆయన అప్రశ్నించారు. భూమా నాగిరెడ్డి నామినేషన్ వేయడానికి వెళుతున్న సమయంలో దాడులు జరుగుతుంటే భుజాలపై మోసుకెళ్లానన్నారు. అఖిల ప్రియను తన కూతురితో సమానంగా చూశానన్నారు. అలాంటి తనను ఎందుకు చంపాలనుకుంటుందో చెప్పాలన్నారు.

అఖిల ప్రియ కుటుంబంతో తనకు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని స్పష్టం చేసారు. భూమా నాగి రెడ్డి కోసం తాను నంద్యాల సీటు వదులుకున్న విషయాన్నీ అయన గుర్తుచేశారు. అఖిల ప్రియను వెంటనే అరెస్టు చేయాలనీ అయన డిమాండ్ చేసారు. అఖిల ప్రియా మంత్రిగా ఒడిపియిందని తానెప్పుడూ అనలేదన్నారు. ఆమెకు ఇంచార్జ్ బాధ్యతలు ఇస్తే నియోజక వర్గంలో ఇంకా ఎంతమందిని చంపిస్తుందో అని అన్నారు. ఆమెకు తప్ప ఎవరికీ సీటు ఇచ్చిన తాను మద్దతిస్తానని తెలిపారు.

Related News