logo

  BREAKING NEWS

క‌డుపులో మంట ఎందుకొస్తుంది ? ఎలా త‌గ్గించుకోవాలి ?  |   ఇక మీ గ‌డ‌ప వ‌ద్ద‌కే బ్యాంకు వ‌స్తుంది.. కొత్త స‌ర్వీసు  |   బ్రేకింగ్‌: తెలుగుదేశం పార్టీ పార్ల‌మెంటు అధ్య‌క్షుల నియామ‌కం  |   ఆ ఛాన‌ల్ ప్రోగ్రాంకు రాక‌పోయి ఉంటే ఎస్పీ మ‌న‌తోనే ఉండేవారా..?  |   బీజేపీ జాతీయ క‌మిటీ నియామ‌కం.. న‌లుగురు తెలుగువాళ్ల‌కు చోటు  |   టీడీపీ, వైసీపీ శ్రేణుల‌ను ఉర్రూత‌లూగించిన ఆ రెండు పాట‌లు పాడింది బాలునే  |   సొంతిల్లు దానం.. స‌మాధిపై ఏం రాయాలో ముందే చెప్పిన బాలు  |   శానిటైజ‌ర్ ఎక్కువ‌గా వాడుతున్నారా..? ఈ ప్ర‌మాదాలు ఉన్నాయి జాగ్ర‌త్త‌..!  |   విషాద వార్త‌… ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఇక లేరు  |   తుమ్ములు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా ? ఈ చిట్కా పాటిస్తే త‌గ్గిపోతాయి  |  

టీడీపీ – వైసీపీ వ‌ర్గాల మ‌ధ్య చిచ్చుపెట్టిన ఆష్టాచెమ్మా ఆట‌..!

అష్టాచెమ్మా ఆట రెండు పార్టీల‌కు చెందిన రెండు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగిన సంఘ‌ట‌న గుంటూరు జిల్లా చిరుమామిళ్ల‌లో జ‌రిగింది. లాక్‌డౌన్ కావ‌డంతో గ్రామంలోని రోడ్డుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ‌ర్గీయులు అష్టాచెమ్మా అడుకుంటున్నారు. ఇది చూసిన తెలుగుదేశం పార్టీ వ‌ర్గీయులు రోడ్డుపై ఎందుకు ఆడుకుంటున్నార‌ని ప్ర‌శ్నించారు. దీంతో టీడీపీ – వైసీపీ వ‌ర్గీయుల మ‌ధ్య మాటామాటా పెరిగింది.

అప్ప‌టికే గ్రామంలోని రెండు వ‌ర్గాల మ‌ధ్య పాత విభేదాలు ఉన్నాయి. దీనికి అష్టాచెమ్మా గొడ‌వ కూడా తోడ‌వ‌డంతో రెండు వ‌ర్గాలు ప‌ర‌స్ప‌రం క‌ర్రెలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ఇరు వ‌ర్గాల వారికి గాయాల‌య్యాయి. ర‌క్తాలు కారే వ‌ర‌కు కొట్టుకోవ‌డంతో గాయ‌ప‌డిన వారిని వెంట‌నే ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘ‌ట‌న‌తో గ్రామంలో ఉద్రిక్త ప‌రిస్థితులు కొన‌సాగుతున్నాయి. వైసీపీకి చెందిన 10 మందిపై, తెలుగుదేశం పార్టీకి చెందిన 10 మందిపై పోలీసులు కేసులు న‌మోదు చేశారు. గ్రామంలో మ‌ళ్లీ గొడ‌వ‌లు జ‌ర‌గ‌కుండా ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేసి ప‌రిస్థితి స‌మీక్షిస్తున్నారు.

Related News