logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

రూ. 40 కోట్లు పెట్టి కొన్న బస్సులు ‘తుక్కు’ కిందకే: టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం!

ఇప్పటికే నష్టాల బాటలో పయనిస్తున్న తెలంగాణ ఆర్టీసీ మరో భారీ నష్టాన్ని మూటగట్టుకోనుంది. స్క్రాప్ పాలసీ కింద మినీ వజ్ర బస్సులను తుక్కు కింద మార్చడానికి ఆర్టీసీ ఆదేశాలు జారీ చేసినట్టుగా సమాచారం అందుతుంది. ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించాలన్న ఉద్దేశ్యంతో 2017 లో ఆర్టీసీ వజ్ర బస్సులను ప్రవేశ పెట్టింది. ఏసీ, సౌకర్యవంతమైన సీట్లు ఇలా సకల సదుపాయాలతో వీటిని రూపొందించారు. ఈ ఒక్క బస్సును అప్పట్లోనే రూ. 70 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసింది సంస్థ.

మొత్తం 60 బస్సులకు కలిపి రూ40 కోట్లను ఖర్చు చేసింది. మొదట ఈ బస్సులను హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లి, మెహదీపట్నం, దిల్ షుక్ నగర లాంటి ప్రాంతాల్లో నడిపింది. ఆ తర్వాత మరిన్ని ప్రధాన నగరాలలో కూడా ఈ సర్వీసులను విస్తరించారు. అయితే అధికారుల ఈ ప్రయత్నం బెడిసికొట్టింది. ఈ వజ్ర బస్సులలో ప్రయాణించడానికి ప్రయాణికులు ఆసక్తి చూపలేదు.

ఈ బస్సులకు ఆన్ లైన్ లోనే టికెట్లు బుక్ చేసుకోవాల్సి రావడం, టికెట్ ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో భారీ నష్టాలను మూటగట్టుకుంది. ఈ బస్సులు కనీసం 50 శాతం సీటింగ్ అక్యుపెన్సీని కూడా సాధించలేక ఘోరంగా విఫలమయ్యాయి. ఇటీవల లాక్ డౌన్ కారణంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. మూడేళ్లుగా ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ పాడైపోయాయి. అప్పటి నుంచి వాటిని ఏమి చేయాలన్న అంశంపై అధికారులు ఒక నిర్ణయానికి రాలేకపోయారు.

లాక్ డౌన్ తర్వాత ఇచ్చిన సడలింపులతో దశల వారీగా రోడ్డెక్కాయి. కానీ వజ్ర బస్సులను మాత్రం షెడ్డుకే పరిమితం చేశారు అధికారులు. వీటికి సంబందించిన కనీస మెయింటెనెన్స్ పై కూడా సిబ్బంది శ్రద్ధ చూపకపోవడంతో ఈ ఖరీదైన బస్సులు తుప్పుపట్టిపోయాయి. ఇక ఎలాగో పనికిరావన్న కారణంతో వీటిని తుక్కుగా మార్చాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఈ నిర్ణయం గనక అమలైతే రూ. 40 కోట్లు బూడిదలో పోసిన పన్నీరైనట్టే. దీంతో అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Related News