logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

పెద్దలను ఎదురించి హిజ్రాతో సహజీవనం.. చివరికి..

హిజ్రాను ప్రేమించిన యువకుడు ఆమెను పెళ్లి చేసుకోవడానికి కుటుంబ పెద్దలను కూడా ఎదురించాడు. అనుకున్నట్టుగానే ఇద్దరూ పెళ్లి చేసుకుని వేరుకాపురం పెట్టారు. అంతలోనే విషాదం చోటుచేసుకుంది. తమ నివాసంలో ఇద్దరు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్లారు ప్రాంతానికి చెందిన దిలీప్ (26) అనే యువకుడు నిరావీ ప్రాంతానికి చెందిన శివాని (30) అనే హిజ్రాతో పరిచయం ఏర్పడింది.

వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. గత ఆరు నెలలుగా ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. ఒకరోజు తాను హిజ్రాను పెళ్లిచేసుకుంటానని యువకుడు ఇంట్లో వాళ్ళతో చెప్పాడు. ఈ విషయం విని షాకైన కుటుంబ సభ్యులు ఈ పెళ్లి జరిపించబోమని గట్టిగా మందలించారు. ఎలాగైనా కలిసి బతకాలని నిర్ణయించుకున్న ప్రేమికులు ఇంట్లో నుంచి పారిపోయారు.

కారైక్కాల్‌ ఒడుదురై ప్రాంతంలో సహజీవనం కొనసాగించారు. ఇంతలో ఏమైందో ఏమో గాని శనివారం నాడు గదిలో ఇద్దరు ఉరి వేసుకుని కనిపించారు. వీరిద్దరూ ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related News