logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

హీరోయిన్ తో ప్రేమలో పడ్డ దర్శకుడు.. త్వరలో పెళ్లి!

తమిళ దర్శకుడు దేసింగ్ పెరియ స్వామీ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అతని పేరుతో కంటే ‘కనులు కవులను దోచాయంటే’ సీనియా దర్శకుడుగానే తెలుగు ప్రేక్షకులు గుర్తు పడతారు. దుల్కర్ సల్మాన్ – రీతూ వర్మ జంటగా తెరకెక్కన ఈ సినిమా తెలుగులో ఊహించని విజయాన్ని అందుకుంది.

ఈ సినిమా తోనే దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు పెరియస్వామి. రజనీకాంత్ కూడా ఈ సినిమా కాన్సెప్ట్ ను మెచ్చుకోవడం విశేషం. అయితే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన నిరంజని అగత్యాన్ తో దర్శకుడు ప్రేమలో పడ్డాడు. షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందట. దీంతో ఇప్పుడు వీరు మూడు మూళ్ళ బంధంతో ఒక్కటి కాబోతున్నారు.

పెళ్లి కార్డును సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో తన సంతోషాన్ని పంచుకున్నారు. కాగా నిరంజని నటిగానే కాకుండా ఫ్యాషన్ డిజైనర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో రీతూ వర్మ స్నేహితురాలిగా నటించి మంచి మార్కులే కొట్టేసింది. ఇప్పుడు అదే సినిమా దర్శకుడిని పెళ్లాడబోతుంది. కాగా ఈ జంటకు నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు.

Related News