టీవీ నటి శ్రావణి ఆత్మహత్య ఘటన మరువకముందే తమిళ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. అతి చిన్న వయసులోనే టీవీ షోల ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న టీవీ నటి చిత్ర(29) హఠాత్తుగా బలవన్మరణానికి పాల్పడ్డారనే వార్త తమిళ పరిశ్రమను షాక్ కు గురి చేస్తుంది. ఈవార్త విన్న ఆమె అభిమానులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
చెన్నైలోని ఓ హోటల్ గదిలో ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈవీవీ ఫిలిం సిటీలో ఓ సీరియల్ షూటింగ్ లో పాల్గొన్న చిత్ర నిన్న రాత్రి 2:30 సమయంలో తిరిగి తన హోటల్ గదికి చేరుకుంది. అనంతరం తన ఫియాన్సీకి ఫోన్ చేసి షూటింగ్ ముగించుకుని హోటల్ రూమ్ కి వచ్చానని పడుకుంటానని చెప్పారు.
మరుసటి రోజు తెల్లవారుజామున ఉదయం చిత్ర ఫోన్ ఎత్తకపోవడంతో అతను హోటల్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. డూప్లికేట్ కీ తో గదిని తెరిచి చూడగా చిత్ర ఉరి వేసుకుని కనిపించింది. కాగా ఇటీవలే చిత్రకు ఓ బిజినెస్ మ్యాన్ తో నిశ్చితార్థం అయ్యింది. వారిద్దరూ ఇదే హోటల్ రూమ్ లో కలిసి ఉంటున్నారు.
అతను లేని సమయంలో చిత్ర ఇలాంటి దారుణానికి ఒడిగటింది. తమిళ నాట కొన్ని ఈవెంట్లలో యాంకర్ గా పని చేసిన చిత్ర పాపులర్ టీవీ షో అయినా పాండ్యన్ స్టోరీస్ లో ఆమె మూలాన్ పాత్రలో నటిస్తున్నారు ఈ షోతో ఆమెకు చాలా మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.