logo

  BREAKING NEWS

క‌రోనా బాధితుల‌కు గ్రీన్ ఫంగ‌స్ ముప్పు..లక్ష‌ణాలు, జాగ్ర‌త్త‌లు ఇవే  |   FACK CHECK: క‌రోనా వ్యాక్సిన్ వేసుకుంటే శ‌రీరం అయ‌స్కాంతం అవుతుందా ?  |   కేతిరెడ్డికి జ‌గ‌న్ బంప‌ర్ ఆఫర్.. షాక్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు  |   క‌రోనా వ్యాక్సిన్ వేసుకున్నాక ఈ ప‌నులు అస్స‌లు చేయ‌కండి  |   గుడ్ న్యూస్‌.. ఆ వ్యాక్సిన్ సామ‌ర్థ్యం 90 శాతం  |   నెయ్యి తింటే లావుగా అవుతారా ? నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదా ?  |   అరుదైన రికార్డు సొంతం చేసుకోనున్న బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి  |   కేసీఆర్ మాస్ట‌ర్‌స్ట్రోక్‌.. హుజురాబాద్‌లో ఈట‌లకు క‌ష్ట‌మే  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వేరు జెండా.. కుప్పంలో కొత్త డిమాండ్‌  |   పెట్రోల్‌లో 20 శాతం ఇథ‌నాల్‌.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర.. మ‌రెన్నో లాభాలు  |  

కరోనా సమయంలో ఆ నెటిజన్ కామెంట్ బాధించింది: తమన్నా

టాలీవుడ్ హీరోయిన్ , మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు కూడా వైరస్ సోకింది. హైదరాబాద్ లో ఓ వెబ్ సిరీస్ లో పాల్గొంటున్న సమయంలో ఆమెకు కరోనా సోకింది. జ్వరం, ఇతర కరోనా లక్షణాలు కనిపించాయని ఆ తర్వాత ఆ లక్షణాలు మరింత ఎక్కువ కావడంతో పరీక్ష చేయించుకుంటే కరోనా పాజిటివ్ గా తేలిందన్నారు.

తనను కరోనా లక్షణాలు తీవ్రంగా వేధించాయన్నారు. ఆ సమయంలో మానసికంగా కుంగిపోయానని, ఆ సమయంలో చనిపోతానేమో అని భయపడ్డానని తెలిపింది. అయితే తనకు వైద్యం అందించిన డాక్టర్ల వల్లే తాను కోలుకోగలిగానని పేర్కొంది. వారితో కలిసి తీసుకున్న ఫోటోను షేర్ చేస్తూ కృతజ్ఞతలు తెలిపింది.

అయితే కరోనా సోకిన సమయంలో తీసుకున్న ఆహారం, మందుల కారణంగా తాను కొంచెం బరువు పెరిగానని అయితే తన ఆరోగ్య పరిస్థితిని కూడా గమనించకుండా ఓ నెటిజన్ తన శరీర బరువుపై కామెంట్ చేయడం బాధించిందని ఆవేదన వ్యక్తం చేసింది ప్రస్తుతం తమన్నా కరోనా నుంచి కోలుకుని తిరిగి సాధారణ స్థితికి చేరుకుంది. ఇప్పుడు ఆమె గోపిచంద్ తో కలిసి ‘సీటీ మార్’ అనే సినిమాలో, సత్యదేవ్ తో మరో సినిమాలో నటిస్తుంది.

Related News