logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

కరోనా నుంచి కోలుకున్నా జుట్టు రాలుతోందా? సెలెబ్రిటీలు పాటిస్తున్న చిట్కా ఇదే!

కరోనా నుంచి కోలుకున్న వారిలో చాలా మందిని ఇతర అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. కరోనా తగ్గినా నీరసం, అలసట వెంటాడుతున్నాయి. అందులో జుట్టు రాలే సమస్య కూడా ఒకటి. సాధారణంగా కరోనా సోకిన వారిలో కనిపించే లక్షణాల్లో జుట్టురాలడం కూడా ఒకటని పరిశోధనల్లో తేలింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా చాలా మంది ఈ సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి సినీ సెలబ్రిటీలు కూడా అతీతులేమి కాదు. కరోనా నుంచి కోలుకున్న హీరోయిన్లు తమన్నా భాటియా, మలైకా అరోరా, బిపాసా బసు లాంటి వారు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నామని సోషల్ మీడియా ద్వారా తమ అనుభవాలను పంచుకుంటున్నారు. అయితే వీరంతా జుట్టు రాలే సమస్యను ఎదుర్కోవడానికి ఒక చిట్కాను కూడా సూచిస్తున్నారు.

తమ జుట్టు సమస్యలు తగ్గించుకోవడానికి ఆనియన్ జ్యుస్ ను వాడుతున్నామని చెప్తున్నారు. ఇది వారికి బాగా పని చేస్తుండటంతో అదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఉల్లి రసం వలన జుట్టు పెరుగుతుందా అనే విషయంపై శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేవు. కొంత మందికి ఇది మంచి ఫలితాలను ఇస్తుంటే అందుకు ఇతర కారణాలు వారి ఆరోగ్య స్థితిగతులు కూడా దోహదం చేసి ఉండచ్చు, మరికొందరికి ఇది పని చేయడం లేదంటే దానికీ కొన్ని కారణాలు ఉండి ఉండవచ్చు. ఫలితమేదైనా ఖర్చు లేకుండా ఎవరికి వారు చేసుకునే చిట్కా కావడంతో ఓసారి ప్రయత్నించి చూడటంలో తప్పు లేదంటున్నారు కొందరు.

జుట్టు పెరిగేందుకు కారణాలు ఇవే..
ఆనియన్ జ్యూస్ లో ఉండే పోషకాల గురించి చూసుకుంటే.. ఇందులో ఉండే సల్ఫేర్ జుట్టు రాలడాన్ని అరికట్టి, జుట్టు లోతుగా బలంగా పెరిగేలా చేస్తుంది. అలాగే కుదుళ్ళలో కొలాజెన్ ఉత్పత్తికి కారణమవుతుంది. అందువల్ల ఆరోగ్య కరమైన చర్మ కణాలు పుట్టుకొస్తాయి. ఇవి జుట్టు పెరగడానికి సహకరిస్తాయి. ఉల్లిపాయతో ఉండే ఆంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లెవనాయిడ్స్ కుదుళ్ళకు రక్తప్రసరణ బాగా జరిగేలా చేస్తాయి. అందువల్ల కుదుళ్ళు పొడి బారాకూండ చుండ్రు సమస్య తలెత్తకుండా జాగ్రత్త పడవచ్చు. దీనిలో ఉండే క్యాటలేజ్‌‌‌‌ అనే ఎంజైమ్‌‌‌‌ వెంట్రుకలు పెరిగేందుకు సాయపడుతుంది.

అలొపేషియా కూడా తగ్గిస్తుందా..?
ఒక్కోసారి కుదుళ్ళలో దురదగా అనిపిస్తుంటుంది. అది ఏదైనా ఇన్ఫెక్షన్ కు సంబందించినది కావచ్చు. అలాంటి సమయాల్లో ఉల్లిపాయలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఈ సమస్యను పూర్తిగా తొలగించగలవు. కొంత మంది కుదుళ్ళలో అక్కడక్కడా ప్యాచుల్లాగా జుట్టు రాలిపోతుంది. అది చూడటానికి ఇబ్బందికరంగా ఉండి అసౌకర్యంగా మారుతుంది. దీనినే అలొపేషియా అంటారు. నిజానికి అలొపేషియా సమస్యకు ఆధునిక వైద్యంలో పూర్తి వైద్యం లేదని అంటారు. కానీ ఉల్లిపాయ రసాన్ని అలాంటి చోట్ల రాయడం వలన చాలా మందిలో అలొపేషియా సమస్య నయం అవుతుందని చెప్తున్నారు. దీనిపై జరిపిన ఓ అధ్యయనంలో కూడా ఈ విషయం రుజువైంది. మరి ఇన్ని ఇన్ని ఔషధ గుణాలున్న ఆనియన్ జ్యూస్ ను తలకు ఎలా ఉపయోగించాలో చూద్దాం.

ఎలా వాడాలి..?
ఒకటి లేదా రెండు పెద్ద సైజు ఆనియన్స్ ను తీసుకోవాలి. దీనిని మిక్సీ లో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ ను ఏదైనా పలుచని వస్త్రంలో వడకట్టి రసాన్ని సేకరించాలి. దీనిలో కాటన్ బాల్ ను ముంచి జుట్టు కుదుళ్లకు పట్టించాలి. అరగంట నుంచి నలభై నిమిషాల వరకు ఉంచి తర్వాత ఏదైనా హెర్బల్ షాంపూతో కడిగేయాలి. ఇలా వారానికి ఒకటి రెండు సార్లు చేయవచ్చు. ఇంకా మంచి ఫలితం ఉండాలంటే ఈ మిశ్రమంలో కొబ్బరి నూనె గాని, ఆలివ్ నూనె గాని కలిపి వాడుకోవాలి.

Related News