logo

  BREAKING NEWS

రాబిన్ శ‌ర్మ‌తో చంద్ర‌బాబు ఒప్పందం..! ఆయ‌న ట్రాక్ రికార్డ్ తెలుసా..?  |   Breaking: వ‌ర‌ద బాధితుల‌కు భారీ సాయం ప్ర‌క‌టించిన కేసీఆర్‌  |   టీడీపీ క‌మిటీల నియామ‌కం.. లోకేష్‌, బాల‌య్య‌, సుహాసినికి కీల‌క ప‌ద‌వులు  |   బిగ్ బ్రేకింగ్‌: రెండు రాష్ట్రాల‌కు టీడీపీ అధ్య‌క్షుల నియామ‌కం  |   వ్యాక్సిన్ వ‌చ్చినా క‌రోనా ఇక ఎప్ప‌టికీ మ‌న‌తోనే ఉంటుంద‌ట‌  |   పాకిస్థాన్‌ వ‌ల్ల మ‌న పానీపూరీ రేట్లు పెరుగుతున్నాయి తెలుసా ?  |   హ‌య‌త్‌న‌గ‌ర్ టీఆర్ఎస్‌ కార్పొరేట‌ర్‌ను గ‌ల్లా ప‌ట్టి కొట్టిన మ‌హిళ‌లు  |   వ‌ర్షాన్ని ఎలా కొలుస్తారు ? మ‌ల్లీమీట‌ర్లు, సెంటీమీట‌ర్ల‌లోనే ఎందుకు కొలుస్తారు ?  |   ఈ సింపుల్ చిట్కాల‌తో సులువుగా పొట్ట త‌గ్గించుకోవ‌చ్చు  |   జ‌గ‌న్ మాత్ర‌మే కాదు.. ఎన్టీఆర్‌, చిరంజీవిని దించిన నాగ‌బాబు  |  

కెలికి క‌య్యం పెట్టుకుంటున్నారు.. జ‌గ‌న్ స‌ర్కార్‌‌పై కేసీఆర్ ఫైర్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నదీ జలాల విషయంలో కావాలనే కెలికి కయ్యం పెట్టుకుంటున్నదని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. వ‌చ్చే నెల 6న అపెక్స్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తున్న వాదనలకు ధీటైన సమాధానం చెప్పాలని ఆయ‌న అధికారుల‌ను ఆదేశించారు. మళ్లీ తెలంగాణ జోలికి రాకుండా వాస్తవాలను కుండబద్ధలు కొట్టినట్లు స్పష్టం చేయాలన్నారు. ఇందుకుగానూ ఆయ‌న రేపు మ‌ధ్యాహ్నం ఉన్న‌తాధికారుల‌తో స‌మావేశం ఏర్పాటు చేశారు.

ఏపీ తీరుతో పాటు అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వ నిష్క్రియాపరత్వాన్ని, ఏడు సంవత్సరాల అలసత్వాన్ని ఈ సమావేశంలో తీవ్రంగా ఎండగట్టాలని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజల హక్కులను హరించడానికి జరుగుతున్న ప్రయత్నాన్ని ప్రతిఘటించాలని, నిజానిజాలను ఈ సమావేశం సందర్భంగా యావత్ దేశానికి తేటతెల్లం చేయాలని అన్నారు. రాష్ట్రాల పునర్విభజన చట్టాల ప్రకారం దేశంలో ఎప్పుడైనా కొత్త రాష్ట్రం ఏర్పడితే వెంటనే ఆ రాష్ట్రానికి నీటిని కేటాయించాలని, తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఏర్పడితే జూన్ 14న తెలంగాణకు నీటి కేటాయింపులు జరపాలని ప్ర‌ధానికి లేఖ రాశామ‌న్నారు.

ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ 1956 సెక్షన్ 3 ప్రకారం ప్రత్యేక ట్రిబ్యూనల్ వేసైనా, లేదంటే ఇప్పుడున్న ట్రిబ్యూనల్ ద్వారా అయినా తెలంగాణకి నీటి కేటాయింపులు జరపాలని కోరామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్యనైనా, లేదంటే నదీపరివాహాల ప్రాంతాల్లోని మొత్తం రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ జరపాలని కోరామన‌, ఏడేళ్లు గ‌డుస్తున్నా ప్రధాన మంత్రికి రాసిన లేఖకు ఈ నాటికి స్పందన లేదని కేసీఆర్ ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం నుండి ఉలుకు లేదు పలుకు లేదని, పైగా అపెక్స్ సమావేశాల పేరిట ఏదో చేస్తున్నట్టు అనిపిస్తున్నారు కానీ కేంద్రం ఏమీ చేయడం లేదన్నారు. 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపి కూడా గట్టిగా ఎండగట్టాలని,. తెలంగాణకు నీటి కేటాయింపుల విషయంలో స్పష్టత ఇవ్వాలని పట్టుపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కోరుతున్న న్యాయమైన డిమాండ్ల విషయంలో అవసరమైన అన్ని వాదనలు సిద్ధంగా ఉండాల‌ని సూచించారు.

Related News