logo

  BREAKING NEWS

నిమ్మగడ్డకు ఉద్యోగ సంఘాల కౌంటర్: వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!  |   అమెరికా అధ్యక్షుడి ప్రసంగాల వెనుక మన తెలుగోడి ప్రతిభ  |   ‘పంచాయతీ’ నోటిఫికేషన్ ఎఫెక్ట్: షాకిస్తున్న అధికారులు!  |   ముగిసిన 5 గంటల డెడ్ లైన్.. ఎస్ఈసీకి అధికారుల షాక్!  |   కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడికి ముహూర్తం ఫిక్స్.. కీలక ప్రకటన!  |   అయోధ్య రామ‌మందిరానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ భారీ విరాళం  |    గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ.. ఏం తెలుస్తారో?  |   చికెన్‌, కోడిగుడ్లు ఇలా తింటే డేంజ‌ర్‌.. fssai జాగ్ర‌త్త‌లు  |   తిరుపతి ఉపఎన్నిక పోరులో జనసేన అభ్యర్థి.. పవన్ క్లారిటీ!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇక వారికి 10 శాతం రిజ‌ర్వేష‌న్లు  |  

ద‌త్త‌పుత్రిక వివాహానికి కేసీఆర్ అపురూప కానుక‌

స‌వ‌తి త‌ల్లి చేతిలో దారుణ వేధింపుల‌కు గురైన ప్ర‌త్యూష అనే అమ్మాయిని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ద‌త్త‌త తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇంత‌కాలం కేసీఆర్ సూచ‌న‌ల మేర‌కు తెలంగాణ రాష్ట్ర మ‌హిళా‌, శిశు సంక్షేమ శాఖ అధికారులు ప్ర‌త్యూష బాగోగులు చూసుకుంటున్నారు. ఆమెకు వ‌స‌తి ఏర్పాటు చేసి, విద్యనందించారు. ప్ర‌స్తుతం ఆమె చ‌దువు పూర్తై ఉద్యోగం చేస్తున్నారు.

ప్ర‌త్యూష గురించి తెలుసుకున్న హైద‌రాబాద్‌కు చెందిన చ‌ర‌ణ్ రెడ్డి అనే యువ‌కుడు ఆమెను పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. త‌న పెళ్లి ప్ర‌తిపాద‌న‌ను ప్ర‌త్యూష‌కు, ఆమె బాగోగులు చూస్తున్న అధికారుల‌కు తెలియ‌జేశారు. ఈ విష‌యాన్ని వారు ముఖ్య‌మంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. చ‌ర‌ణ్ రెడ్డి గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న త‌ర్వాత కేసీఆర్ కూడా ప్ర‌త్యూష వివాహం చ‌ర‌ణ్ రెడ్డితో జ‌రిపించాల‌ని నిర్ణ‌యించారు.

ఇవాళ ఆమె వివాహం న‌గ‌రంలోని ఓ చ‌ర్చ్‌లో జ‌రిగింది. నిన్న ప్ర‌త్యూష‌ను పెళ్లికూతురును చేశారు. స్వ‌యంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ సతీమ‌ణి శోభ ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రై ప‌ట్టుబ‌ట్ట‌లు పెట్టి ప్ర‌త్యూష‌ను సంప్ర‌దాయబ‌ద్ధంగా పెళ్లికూతురును చేశారు. ఈ సంద‌ర్భంగా విలువైన‌ డైమెండ్ నెక్లేస్‌ను కేసీఆర్ కుటుంబం ప్ర‌త్యూష‌కు కానుక‌గా ఇచ్చింది.

Related News