logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

పొట్ట తగ్గి ఫిట్ గా మారాలనుకుంటున్నారా? ఈరోజే స్విమ్మింగ్ మొదలుపెట్టండి!

స్విమ్మింగ్ అనేది చాలా మందికి ఒక హాబీ. క్రమం తప్పకుండా స్విమ్మింగ్ చేసేవారికి దీని వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిసే ఉంటుంది. ఒక సారి స్విమ్మింగ్ కు అలవాటు పడితే ఈ వ్యాపకం ద్వారా కలిగే అనుభూతి అంతా ఇంతా కాదు. మానసిక ప్రశాంతతని కోరుకునే వారికి ఇది మంచి ఆప్షన్. చాలా మంది యువతీ యువకులు వివిధ కారణాల వలన బలహీనంగా మారతారు. ఎంత మంచి ఆహరం తీసుకున్నా అది ఒంటికి పెట్టకపోవడంతో ఫలితం ఉండదు. ఇలాంటి వారు మంచి ఆహారంతో పాటుగా స్విమ్మింగ్ చేస్తే చాలా తక్కువ సమయంలో శారీరక దృఢత్వం లభిస్తుంది. ఈ ప్రక్రియలో శరీరం నీటి అలలకు ఎదురీదాల్సి వస్తుంది. అందుకోసం శరీరంలోని ప్రతి కండరం కదలికలకు లోనవుతుంది. అది మన కండరాలకు బలాన్ని ఇస్తుంది. ఫలితంగా మజిల్ బిల్డింగ్ కూడా సాధ్యమవుతుంది.

ఇది మీ హార్ట్ రేట్ ను సరిగా ఉంచుతుంది. అందువల్ల గుండె జబ్బుల బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుంది. ఆరోగ్యకరంగా బరువు పెరగాలనుకునే వారికి సహాయపడుతుంది. మీకు తెలియకుండానే మీలో మానసిక ఒత్తిడి మాయమవుతుంది. స్విమ్మింగ్ చేసేవారిలో ఆకస్మిక మరణాలు సంభవించే ప్రమాదం చాలా అరుదుగా అంటుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఇది మీ బ్లడ్ షుగర్ ను అదుపులో ఉంచుతుంది. ఒక్క స్విమ్మింగ్ చేయడం ద్వారా మాత్రమే శరీరంలోని ప్రతి అవయవానికి వ్యాయామం లభిస్తుంది. ఫిట్ గా మరలనుకునే వారికి దీనికి మించిన ఎక్సర్సైజ్ మరొకటి ఉండదు.

స్విమ్మింగ్ చేసేవారిలో ఆలోచనా శక్తి అద్భుతంగా పని చేస్తుంది. వీరిలో మెమరీ లెవల్స్ కూడా చాలా అధికంగా ఉంటాయి. శరీరంలో ఇన్సులిన్ నిరోధకను తగ్గించి మెదడులో కొత్త కణాల పెరుగుదలకు సహాయపడుతుంది. చాలా మందిలో ఒత్తిడి కారణంగా ఆత్రుత, మూడు స్వింగ్స్ తరచుగా మారడం లాంటివి కనిపిస్తాయి. ఈ సమస్యలను తగ్గించి మీ మీ ఆలోచనలను మరింత ప్రభావవంతంగా చేస్తుంది. ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నవారికి స్విమింగ్ చేయడం చాలా అవసరం. ఇది మీ లంగ్స్ ను ధృడంగా మారుస్తుంది. త్వరగా బరువు తగ్గాలన్నా, బరువు పెరగలన్నా స్విమింగ్ చేయండి. ఒక గంట పాటు స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడితే దాదాపు 715 క్యాలరీలు ఖర్చు అవుతాయి.

స్త్రీలలో చోటు చేసుకునే అనేక మార్పుల కారణంగా నడుము, తొడలలో కొవ్వు శాతం పెరిగిపోతుంది. వారికి కూడా ఇది మంచి వ్యాయామం. రోజులో ఒక అరగంటను స్విమ్మింగ్ కు కేటాయిస్తే ఒక రోజుకి అవసరమయ్యే ఎనర్జీని మీకు రీఛార్జ్ చేసుకున్నట్టే. నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి కూడా ఇలా చేయడం వలన ఆ సమస్యలు తొలగిపోతాయి. చాలా మందిలో మొదట స్విమ్మింగ్ మొదలు పెట్టగానే కండరాలు పట్టేసినట్టుగా అనిపించడం సహజమే. మీలో పోషక విలువలు తక్కువగా ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది. అందువల్ల మంచి ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం.

Related News