logo

  BREAKING NEWS

ఢిల్లీ రైతుల ఆందోళనపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు!  |   రామనాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ సీఎం జగన్!  |   మైండ్‌బ్లాక్ అయ్యే రీతిలో ”వ‌కీల్ సాబ్” రెమ్యున‌రేష‌న్‌  |   ఎమ్మెల్యేకు క‌రోనా.. ఏపీ అసెంబ్లీలో కోవిడ్ క‌ల‌వ‌రం  |   అంద‌రికీ వ్యాక్సిన్ అవ‌స‌రం లేదు… వ్యాక్సిన్ వ‌చ్చినా మాస్కులు త‌ప్ప‌వు  |   ఏపీ అసెంబ్లీ: చంద్రబాబు స్పీకర్ మధ్య మాటల యుద్ధం!  |   ప్ర‌భాస్ – ప్ర‌శాంత్ నీల్ తీసేది రీమేక్ సినిమా.. ఇంత రిస్క్ ఎందుకు..?  |   ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం.. ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం!  |   పేద విద్యార్థులకు ఎల్ఐసీ స్కాల‌ర్‌షిప్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవీ  |   బ్రేకింగ్: గ్రేటర్ లోని ఆ ప్రాంతంలో పోలింగ్ రద్దు: ఎన్నికల సంఘం  |  

ఈ మౌత్ స్ప్రే తో 20 నిమిషాల్లో కరోనా అంతం

ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న ఒకే ఒక్క శుభవార్త ఏదైనా ఉందా అంటే అది కరోనాకు వాక్సిన్ కనుగొనడం మాత్రమే. ఈ కరోనా మహమ్మారి జన జీవనాన్ని అంతలా తలకిందులు చేసింది. స్వేచ్ఛగా బయటకు వచ్చి ఎన్ని నెలలు అయ్యిందో కూడా ప్రజలు మర్చిపోయారు. ఎటు చూసినా కరోనా ఆంక్షలతో భయం భయంగా గడుపుతున్నారు.

ఈ నేపథ్యంలో స్వీడన్ కు చెందిన ఓ ఫార్మా సంస్థ ఓ శుభ వార్తను మోసుకొచ్చింది. కరోనాను తరిమేయగల మందును కనిపెట్టామని వెల్లడించింది. అయితే అది వాక్సిన్ కాదు. ఒక మౌత్ స్ప్రే. ఎంజైమాటికా అనే సంస్థ కోల్డ్ జైమ్ అనే మౌత్ స్ప్రే ద్వారా 20 నిమిషాల్లో వైరస్ ను నిరోధించవచ్చని ప్రకటించింది. ప్రాథమికంగా తాము జరిపిన అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైందని పేర్కొంది. కోల్డ్ జైమ్ మౌత్ స్ప్రే ను నోరు, గొంతు భాగాల్లో స్ప్రే చేయవలసి ఉంటుంది.

20 నిమిషాల వ్యవధిలో 98.3 శాతం వైరస్ ను ఇది అంతం చేస్తుంది అని చెబుతున్నారు. ఈ స్ప్రే ఒక్క కరోనా వైరస్ నే కాకుండా ఈ జాతికి చెందిన అన్ని వైరస్ లను, నోటి ద్వారా వ్యాప్తి చెందే వైరస్ లను కూడా నాశనం చేయగలదని పేర్కొన్నారు. ఇందులో ఉండే గ్లిజ‌రాల్‌, అట్లాంటిక్ కాడ్ ట్రిప్సిన్ల‌తో కూడిన ద్రావ‌ణం వైరస్ ను చంపేస్తుందని అంటున్నారు. కాగా దీనిపై మరిన్ని పరిశోధనలు జరిపి త్వరలోనే ప్రపంచానికి శుభవార్త అందిస్తామని ఆ సంస్థ వెల్లడించింది. .

Related News