logo

  BREAKING NEWS

ఓటీటీలో రిలీజైన కేజీఎఫ్: చాప్ట‌ర్‌-2..! కానీ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్‌  |   టాయిలెట్‌లో కెమెరా.. హోంమంత్రికి ఫిర్యాదు  |   కాబోయే భ‌ర్త మృతి.. ఆ యువ‌తి చేసిన ప‌నికి క‌న్నీళ్లు ఆగ‌వు  |   స‌లార్ సినిమాపై కిక్కిచ్చే వార్త‌  |   మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌  |   వంద‌ల ఎక‌రాల భూమి ఉన్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారు  |   2022 – 23కు కేంద్రీయ విద్యాల‌య అడ్మిష‌న్లు ప్రారంభం.. పూర్తి వివ‌రాలు  |   నిరుద్యోగుల‌కు భారీ శుభ‌వార్త‌.. రైల్వేలో 2,65,547 ఖాళీలు  |   మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న జ‌గ‌న్‌.. దేశంలోనే మొద‌టిసారి  |   అండ‌మాన్ ఎన్నిక‌ల్లో మ‌రోసారి స‌త్తా చాటేందుకు చంద్ర‌బాబు స్కెచ్‌  |  

అసెంబ్లీ ఎన్నికల ముందు కేరళ సీఎంకు షాక్.. విజయన్ మెడకు మళ్ళీ అదే కేసు!

అసెంబ్లీ ఎన్నికల వేళ కేరళ సీఎం పినరయి విజయన్ మెడకు మరోసారి ఉచ్చు బిగుస్తుంది. గతేడాది కేరళ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కేరళ సీఎం పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న కేరళ ఐటీ శాఖ లో పనిచేసే స్వప్న సురేష్ విజయన్ పై సంచలన ఆరోపణలు చేశారు.

స్మగ్లింగ్ కేసు విచారణ సందర్భంగా ఆమె విజయన్ ఈ కేసులో కీలకంగా వ్యవహరించారని పేర్కొంది. కాగా సీఎంతో పాటుగా స్పీకర్, మరో మంత్రి కూడా ఈ స్మగ్లింగ్ లో భాగస్వాములుగా ఉన్నట్టుగా తెలిపింది. కాన్సులేట్ తో ఆయన నేరుగా సంభాణలు జరిపేవారని విజయన్ కు అరబిక్ బాష మాట్లాడటం, అర్థం చేసుకోవడం రాని కారణంగా వీరికి మధ్యవర్తిగా తాను వ్యవహరించినట్టుగా తెలిపింది. ఈ మొత్తం వ్యవహారంలో సీఎంతో పాటుగా పలువురు మంత్రులు భారీగా కమిషన్ పొందారని వెల్లడించి షాకిచ్చింది.

కాగా స్వప్న సురేష్ తెలిపిన వివరాలను కస్టమ్స్ అధికారులు హై కోర్టుకు నివేదిక రూపంలో అందించారు. 2020 జులై 5న లో తిరుఅనతపురంలోని యూఏఈ కార్యాలయానికి వస్తున్న అరబ్ ఎమిరేట్స్ లో భారీగా 30 కిలోల బంగారంతో ఉన్న పార్సిల్స్ ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 15 కోట్లు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలోసంచలనం సృష్టించింది. ఈ కేసులో యూఏఈ కాన్సులేట్ ఉద్యోగితో పాటుగా కేరళ ఐటీ శాఖలో పని చేస్తున్న స్వప్న సురేష్ ను ఎంఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం విజయన్ కార్యాలయ ఉద్యోగి కూడా ఈ కేసులో ఆరోపణలుఎదుర్కున్నారు.

Related News