logo

  BREAKING NEWS

ఫలించిన ‘శ్వేత రాయబారం’.. మనసు మార్చుకున్న బుద్ధా!  |   హిందూపురంలో సీన్ రిపీట్.. అభిమానికి విశ్వరూపం చూపించిన బాలయ్య!  |   నా అనుచరుడు ఒక్కడు చాలు.. నీ పని ఖతం: టీడీపీలో బుద్ధా వర్సెస్ కేశినేని  |   అవును అప్పులు చేసాం.. ఆ విషయం గర్వంగా చెప్తాం : మంత్రి బుగ్గన  |   షాకింగ్ సర్వే.. హైదరాబాద్ లో ప్రతి ఇంట్లో ఒకరికి కరోనా!  |   అసెంబ్లీ ఎన్నికల ముందు కేరళ సీఎంకు షాక్.. విజయన్ మెడకు మళ్ళీ అదే కేసు!  |   హై కోర్టుకు ఎన్నికల సంఘం క్షమాపణలు.. ఎందుకంటే?  |   ఇదేనా దోస్తానా..? ఏపీలో అడుగుపెడుతున్న ఎంఐఎం  |   మీ పిల్ల‌ల‌కు బండిస్తున్నారా ? జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి  |   ఆరియానా గ్లోరీకి బంప‌ర్ ఆఫ‌ర్‌.. మెగా హీరో సినిమాలో ల‌క్కీ ఛాన్స్  |  

అలీ పక్కన హీరోయిన్ గా చెయ్యనంది.. సౌందర్యకు ఒక్కటే చెప్పా..

1994 లో వచ్చిన కామెడీ ఎంటర్టైనర్ కమ్ సోషియో ఫాంటసీ సినిమాగా తెరకెక్కిన ‘యమలీల’ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అప్పటికే కమెడియన్ గా దూసుకుపోతున్న అలీని ఈ సినిమాలో హీరోగా ప్రకటించారు ప్రకటించి షాకిచ్చారు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. ఈ సినిమాలో ఆలీకి జోడిగా ఇంద్రజ నటించిన విషయం తెలిసిందే.

కానీ అంతకు ముందు ఈ సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ ను అనుకున్నారట. మొదట యమలీల కథకు ఒకే చెప్పిన ఆ హీరోయిన్ హీరో అలీ అని తెలిసి ఆలోచనలో పడ్డారట. కొంతసమయం తీసుకుని నేను మీ సినిమాలో నటించలేనని చెప్పేసిందట. ఆమె ఎవరో కాదు దివంగత నటి సౌందర్య.

తాజాగా ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమెడియన్ అలీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు సినిమా దర్శకుడు. అప్పటికే సౌందర్య పెద్ద హీరోల సరసన ఆఫర్లు వస్తుండటంతో అలీతో నటిస్తే తన కెరీర్ కు ఇబ్బంది ఏర్పడొచ్చని మీరే ఆలోచించండి నేను ఈ సినిమా ఒప్పుకోవడం కరెక్టేనా అని అడిగారట.

ఒకవేళ మీరు హీరోగా నటిస్తే చేస్తానని అన్నారట. సౌందర్యకు ఆ సమయంలో ఒక్కటే మాట చెప్పను అలీ కోసం ఈ సినిమాలో ఎవరినైనా మార్చుకుంటాను కానీ అలీని మాత్రం మార్చలేను వంద శాతం ఈ సినిమాలో నటించడానికి అలీ అర్హుడు. . ఒక వేళ అలీ స్టార్ హీరో అయితే అప్పుడు నటిస్తావా అతని పక్కన అని అడిగారట కృష్ణారెడ్డి. అందుకు ఆమె షాకయ్యారట.

ఆ తర్వాత ‘శుభలగ్నం’ సినిమాలో అలీతో ఓ స్పెషల్ సాంగ్ లో హీరోయిన్ కోసం వెతుకుతున్న విషయం తెలిసి సౌందర్య స్వయంగా తానే అలీతో నటిస్తానని ముందుకొచ్చారట. అంతే కాదు ఆ రోజు ఎస్వీకృష్ణా రెడ్డితో జరిగిన సంభాషణను గుర్తు చేస్తూ ఆ రోజు అలీతో అవకాశం వదులుకున్నానన్న వెలితి నాలో ఊడిపోయింది. మీకు అభ్యంతరం లేకపోతె ఆ ఒక్క పాట నేను చేస్తానని బతిమిలాడారట. అది సౌందర్య గొప్పతనం అంటూ చెప్పుకొచ్చారు దర్శకుడు.

 

Related News