logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

అక్కడ షిప్పు ఆగిపోతే మన జేబుకు చిల్లు.. ఎందుకో తెలుసా?

20 వేల కంటైనర్లతో వెళ్తున్న ఎవర్ గివెన్ అనే భారీ నౌక ఈజిప్ట్ లోని సూయజ్ కాలువలో చిక్కుకున్న విషయం తెలిసిందే. నౌక కాలువలో అడ్డం తిరగడంతో భూమిలో కొంత భాగం కూరుకుపోయింది. హఠాత్తుగా వచ్చిన బలమైన గాలుల వల్లనే ఇలా జరిగి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ నౌకను నీటిలో తెలియాడేలా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు కొంతమేరకు ఫలించినా పూర్తిగా బయటకు తేవడానికి ఇంకా పడుతుందో స్పష్టంగా తెలియదు. ఈ నౌక ఆగిపోయిన కారణంగా రోజుకి కి 70 వేల కోట్లకు పైగా భారీ నష్టం ఏర్పడుతున్నట్టుగా నిపుణులు అంచనా వేశారు.

ఈ ఒక్క షిప్పు కారణంగా అంతర్జాతీయంగా ఇంత నష్టం చవిచూడటంతో పాటుగా ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే మనందరి జేబులకు కూడా చిల్లు పడే అవకాశం ఉంది. అదెలా అంటే.. 400 మీటర్ల పొడవు.. 59 మీటర్ల వెడల్పు ఉన్న ఈ భారీ నౌక.. సూయజ్ నగర సమీపంలోని సూయజ్ కాలువలో చిక్కుకుపోయింది. అంటే దీని పరిమాణం నాలుగు ఫుట్ బాల పిచ్ లతో సమానం. 193 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ కాలువ మధ్యధరా సముద్రాన్ని ఎర్ర సముద్రంతో కలుపుతుంది అంతర్జాతీయ వాణిజ్యానికి ఈ జల మార్గం చాలా కీలకమైనది. రోజుకి కనీసం 50 పడవలు ఈ మార్గంలో ప్రయాణిస్తాయి. ప్రస్తుతం ఈ మార్గంలో రాకపోకలు స్తంభించిపోయాయి.

ఈ ఘటన జరిగి వారం రోజులు గడస్తుంది. దీంతో ఈ పడవ వెనకాల 450 షిప్పులు ముందుకు కదలలేక నిలిచిపోయాయి. ఆగిపోయిన షిప్పుల్లో సౌదీ.. రష్యన్.. ఒమన్.. యూఎస్ దేశాలకు సంబందించిన ఇంధన నౌకలు కూడా ఉన్నాయి. దీంతో మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే ప్రపంచం నలుమూలలా ఉన్న ప్రజలపై ఆ భారం పడనుంది. సరుకుల రవాణా ఆగిపోవడంతో ధరలు భారీగా పెరుగుతాయని ముఖ్యంగా పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

Related News