logo

  BREAKING NEWS

చంద్ర‌బాబు స‌వాల్‌కు సై అంటున్న జ‌గ‌న్‌..? రెఫ‌రెండంకు సిద్ధం.?  |   టీడీపీ – వైసీపీ వ‌ర్గాల మ‌ధ్య చిచ్చుపెట్టిన ఆష్టాచెమ్మా ఆట‌..!  |   తెలంగాణ‌లో మ‌రో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి క‌రోనా పాజిటీవ్‌  |   పంతం నెగ్గించుకున్న నిమ్మ‌గ‌డ్డ‌.. మ‌ళ్లీ కుర్చీలోకి..!  |   ఆవిరి పీలిస్తే క‌రోనా వైర‌స్ చ‌నిపోతుందా..? అస‌లు నిజం ఇది..!  |   బ్రేకింగ్: కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్!  |   బోది ధ‌ర్ముడిని చంపేశారా..? మ‌రి సైనికుడికి క‌నిపించింది ఎవ‌రు..?  |   విశాఖ షిప్ యార్డు బాధితులకు భారీ సాయం ప్రకటించిన ప్రభుత్వం  |   రాజధానిపై ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు..!  |   బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్య‌వ‌ర్గాన్ని ప్ర‌క‌టించిన బండి సంజ‌య్‌  |  

సుశాంత్ కేసు.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లకు టెన్షన్!

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో రోజుకో కొత్త పరిణామం చోటుచేసుకుంటుంది. సుశాంత్ ఆత్మహత్య చేసుకొని మరణించాడని పోస్ట్‌మార్టంలో తేలినప్పటికీ.. అతడిది హత్య అని ఫ్యాన్స్ ముందు నుంచీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్‌ మాఫియా కారణంగానే సుశాంత్ మరణించాడని అభిమానులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సుశాంత్ ఆత్మహత్య కేసు ఇప్పుడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్లను టెన్షన్ పెడుతుందట.

ఈ మొత్తం వ్యవహారంలో బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ ఎక్కువగా వినిపిస్తుంది. కరణ్ ను విలన్ గా చూపిస్తూ సుశాంత్ అభిమానులు బయోపిక్ ను కూడా ప్రకటించారు అంటే సుశాంత్ సూసైడ్ ఎఫెక్ట్ కరణ్ పై ఎంతలా ఉందొ అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి నుంచి కరణ్ నిర్మించే సినిమాలు కానీ.. తీసే సినిమాలు కానీ అస్సలు చూడమంటూ ప్రతిజ్ఞ చేస్తున్నారు ప్రేక్షకులు. ఇలాంటి టఫ్ సిచ్యువేషన్‌లోనూ బాలీవుడ్ నుంచి ఒక్కరు కూడా కరణ్ జోహార్ పక్షాన నిలబడటలేకపోవడం గమనార్హం.

ప్రేక్షకుల ఆగ్రహానికి గురవుతామనే భయంతో అతని గురించి మాట్లాడటానికి కూడా ఏ ఒక్కరు ముందుకు రావడం లేదు. దీంతో కొంతకాలంగా కరణ్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. సుశాంత్ మృతి తర్వాత అతను ఎదుర్కుంటున్న ఆరోపణల కారణంగా కరణ్ డిప్రెషన్లో ఉన్నాడని అతని సన్నిహితులు చెప్తున్నారు. ఇక బాలీవుడ్ స్టార్ కిడ్ అలియా భట్ ది మరో కథ. అనాలోచితంగా మనం చేసే కొన్ని వ్యాఖ్యలు మన మెడకు ఎలా చుట్టుకుంటాయో చెప్పడానికి అలియా పెద్ద ఉదాహరణ.

గతంలో ఎప్పుడో ఒకసారి సుశాంత్ ఎవరో నాకు తెలియదని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడామె కెరీర్ ను ఇరకాటంలో పెట్టాయి. సుశాంత్ మరణానికి ముందు తర్వాత అన్నట్టుగా ఉంది అలియా కెరీర్. అప్పటివరకు బాలీవుడ్ అందగత్తెలను కూడా వెనక్కి నెట్టి వరుస అవకాశాలను చేజిక్కించుకుంది అలియా.. ఆమెకున్న క్రేజ్ తో రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్ లో కూడా ఛాన్స్ కొట్టేసింది.

భారీ మల్టి స్టారర్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా అలియా నటిస్తుంది. మరోవైపు పూరి జగన్నాథ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమాను పట్టాలెక్కించాడు. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. ఈ సినిమా కోసం పూరీ కరణ్ జోహార్ తో చేతులు కలిపాడు. ఫైటర్ చిత్రీకరణ దాదాపు పూర్తి కావొస్తుంది. కరణ్ నిర్మాత కావడంతో బాలీవుడ్ లో ఈ సినిమా విడుదలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు.

సుశాంత్ పోస్టు మార్టం రిపోర్టు తర్వాత ఈ కేసు ఓ కొలిక్కి వస్తుంది అనుకుంటున్న సమయంలో సుశాంత్ ప్రేయసి రియా చక్రబర్తి సీన్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ కేసులో రియా పాత్రపై దర్యాప్తు కొనసాగుతుంది. దీంతో మరోసారి సుశాంత్ వ్యవహారం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతుంది. ఇది వరకే అలియాను ఆర్ ఆర్ ఆర్ నుంచి తప్పించాలని కొందరు సుశాంత్ అభిమానులు రాజమౌళిని కోరారు.

బాలీవుడ్ మార్కెట్ ను కాదని పాన్ ఇండియా సినిమాలు ముందుకెళ్లడం సులువైన పని కాదు. కరణ్ , అలియా భట్ లు వీరిద్దరి సినిమాల్లో కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఈ సినిమాలకు సుశాంత్ అభిమానుల సెగ తగలడం గ్యారెంటీ అనే టాక్ వినిపిస్తుంది. ముందు ముందు వీరి కారణంగా సినిమాలు చిక్కుల్లో పడే అవకాశం ఉండటంతో పూరి రాజమౌళి లు ఇప్పుడు తలపట్టుకుంటున్నారట. టాలీవుడ్ లో దీనిపైనే జోరుగా చర్చ నడుస్తుంది.

Related News