logo

  BREAKING NEWS

చంద్ర‌బాబు స‌వాల్‌కు సై అంటున్న జ‌గ‌న్‌..? రెఫ‌రెండంకు సిద్ధం.?  |   టీడీపీ – వైసీపీ వ‌ర్గాల మ‌ధ్య చిచ్చుపెట్టిన ఆష్టాచెమ్మా ఆట‌..!  |   తెలంగాణ‌లో మ‌రో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి క‌రోనా పాజిటీవ్‌  |   పంతం నెగ్గించుకున్న నిమ్మ‌గ‌డ్డ‌.. మ‌ళ్లీ కుర్చీలోకి..!  |   ఆవిరి పీలిస్తే క‌రోనా వైర‌స్ చ‌నిపోతుందా..? అస‌లు నిజం ఇది..!  |   బ్రేకింగ్: కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్!  |   బోది ధ‌ర్ముడిని చంపేశారా..? మ‌రి సైనికుడికి క‌నిపించింది ఎవ‌రు..?  |   విశాఖ షిప్ యార్డు బాధితులకు భారీ సాయం ప్రకటించిన ప్రభుత్వం  |   రాజధానిపై ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు..!  |   బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్య‌వ‌ర్గాన్ని ప్ర‌క‌టించిన బండి సంజ‌య్‌  |  

సుశాంత్ కేసులో మరో ట్విస్ట్.. తెరపైకి మాజీ ప్రేయసి!

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు ముగింపు దశకు చేరుకుందని అంతా అనుకుంటున్న సమయంలో ఈ కేసు మరో కీలక మలుపు తీసుకుంది. సుశాంత్ ప్రేయసి రియా చక్రబర్తిపై ఉచ్చు బిగుస్తుంది. సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ సుశాంత్ ఆత్మహత్య కేసులో రియా పాత్రపై విచారణ జరిపించాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ కేసులో సుశాంత్ మాజీ ప్రేయసి అంకిత లోఖండెను బుధవారం ముంబై పోలీసులు విచారించారు. దీంతో ఈ కేసులో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణ సంర్భంగా అంకిత పలు కీలక సంభాషణలను పోలీసులకు వెల్లడించింది. అంకిత సుశాంత్ టీవీ పరిశ్రమ నుంచి కెరీర్ ను మొదలు పెట్టిన విషయం తెలిసిందే.

వీరిద్దరూ కలిసి ‘పవిత్ర రిష్తా’ సీరియల్ లో నటించారు. ఆ తర్వాత సుశాంత్ బాలీవుడ్ హీరోగా మారాడు. అంకిత నటించిన తొలి సినిమా ‘మణికర్ణిక’ విడుదల సందర్భంగా సుశాంత్ ఆమెను అభినందించేందుకు మెసేజ్ చేసాడు. ఆ సమయంలో రియా తనను వేధిస్తోందని తెలిపాడు. తనతో బంధాన్ని ముగించాలనుకుంటున్నానని సుశాంత్ తనతో చెప్పాడని అంకిత పోలీసులకు వెల్లడించింది.

అందులో భాగంగా వీరిద్దరి సంభాషణకు సంబందించిన వివరాలను అందించింది. సుశాంత్ మరణానంతరం అంకిత పాట్నాలోని సుశాంత్ కుటుంబాన్ని రెండు సార్లు పరామర్శించింది. ఆ తర్వాత ఆమె రియాను ఉద్దేశిస్తూ ‘నిజమే గెలుస్తుంది’ అని పోస్టు చేయడం హాట్ టాపిక్ గా మారింది. మొదటి నుండి ఈ కేసులో సుశాంత్ ను బాలీవుడ్ ఆత్మహత్యకు ప్రేరేపించింది అని వాదిస్తున్న నటి కంగనా రనౌత్ మణికర్ణిక సినిమాలో అంకిత ప్రధాన పాత్ర పోషించింది. కాగా ఈ కేసులో మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

Related News