logo

  BREAKING NEWS

సుశాంత్ సర్ కు ఆ అలవాటు ఉంది: షాకింగ్ విషయం బయటపెట్టిన పనిమనిషి

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు మరో కీలక మలుపు తిరిగింది. సుశాంత్ కేసును సీబీఐ కి అప్పగించాలంటూ సుప్రీం ధర్మాసనం ఆదేశించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కేసు విచారణలో మరిన్ని కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. సుశాంత్ ది ఆత్మహత్య కాదు హత్యే అంటూ అతని అభిమానులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా అతని స్నేహతులు, ఇంట్లో పని చేసిన వార్ మాత్రం సుశాంత్ ఆత్మహత్య చేసుకునే మరణించాడని అంటున్నారు.

కాగా ఈ కేసు విచారణలో భాగంగా సుశాంత్ స్నేహితుడు, ఇంటి వంట మనిషిని కూడా విచారించారు. మరో పనిమనిషి నీరజ్ సింగ్ అనే వ్యక్తి మాత్రం విచారణలో సంచలన విషయాలు బయటపెటినట్టుగా జాతీయ మీడియాలో వస్తున్న కథనాలు ఈ కేసును మరో మలుపు తిప్పాయి. అతని తెలిపిన వివరాల ప్రకారం.. సుశాంత్ సర్ వారానికి రెండు సార్లు ఇంట్లో పార్టీ చేసుకునేవారు. మద్యం, గంజాయి తాగే అలవాటు ఉంది.

ఆత్మహత్య చేసుకునే ముందు రోజు కూడా నేనే సార్ కు గంజాయి నింపిన రెండు సిగరెట్ పెట్టెలను తీసుకు వెళ్లి ఇచ్చాను. సార్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత అతని గదిలో ఉన్న సిగరెట్ పెట్టెలను తెరిచి చూస్తే అవి ఖాలీగా ఉన్నాయి. అని అతను చెప్పినట్టుగా జాతీయ మీడియా వివరించింది. దీంతో ఈ కేసులో ఈ కొత్త కోణంలో కూడా మరింత లోతుగా విచారణ జరపనున్నారు అధికారులు.

Related News