logo

  BREAKING NEWS

ఎన్నిక‌ల్లో గెలిస్తే ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్‌… బీజేపీ హామీ  |   18 నెల‌ల జైలు జీవితం.. ఒక్క మాట‌తో వైఎస్సార్‌కు రాజీనామా లేఖ‌  |   కిడ్నాప్ చేసిన గంట‌లోనే హ‌త్య చేశారు.. ఆ భ‌యంతోనే..!  |   దీక్షిత్‌ను పొట్ట‌న పెట్టుకున్న కిడ్నాప‌ర్లు  |   మ‌ళ్లీ తెర‌పైన శ్రీహ‌రి, సౌంద‌ర్య‌ను చూసే అరుదైన‌ అవ‌కాశం  |   కేసీఆర్‌తో గొడ‌వ ఎక్క‌డ మొద‌లైందో చెప్పిన కోదండ‌రాం  |   ఆర్థిక ఇబ్బందుల్లో ప్ర‌ధాని.. ఈ క‌ష్టాలు ఎవ‌రికీ రావేమో..!  |   క‌ర్నూలు మ‌హిళ‌కు దొరికిన‌ కోటి రూపా‌యల వ‌జ్రం  |   బ్రేకింగ్‌: క‌రోనా వ్యాక్సిన్‌పై ప్ర‌ధాని మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న‌  |   ద‌సరా పండుగ రోజు జ‌మ్మి చెట్టుకు ఎందుకు పూజిస్తారో తెలుసా ?  |  

ఆత్మహత్యకు ముందు సుశాంత్ గూగుల్ సెర్చ్ హిస్టరీ.. ఎందుకలా చేసాడు?

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో రోజురోజుకు కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. ఇప్పటికే ఈ కేసులో సంబంధం ఉన్నవారిని, అనుమానితులను 30 మందిని ముంబై పోలీసులు విచారించారు. కాగా సుశాంత్ కేసులో తాజా ఫోరెన్సిక్ నిపుణులు నివేదికను వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 14న ఉదయం సుశాంత్ ఆత్మహత్యకు ముందు ఏం చేసాడనే విషయంపై ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఆత్మహత్యకు ముందు సుశాంత్ తన మొబైల్ ఫోన్ లో గూగుల్ సెర్చ్ చేసినట్టుగా కనుగొన్నారు. ఉదయం 10:15 ప్రాంతంలో సుశాంత్ పదే పదే తన పేరునే గూగుల్ లో సెర్చ్ చేసి చూసుకున్నాడు. సెర్చ్ చేసిన అనంతరం తన టీమ్ కు ఫోన్ చేసి మాట్లాడినట్టు తెలిపారు. అదే సమయంలో తన గదిలో నుంచి బయటకు వచ్చి జ్యుస్ తాగాడు. తన పరువుకు కొందరు వ్యక్తులు భంగం కలిగిస్తున్నారని సుశాంత్ భావించాడని ఆ విషయంలో మానసికంగా కుంగిపోయాడని తెలిపారు.

కాగా సుశాంత్ ను ఆత్మహత్య చేసుకునే విధంగా బాలీవుడ్ ప్రముఖులు ప్రేరేపించారని, అతని ఆత్మహత్యకు వారే కారణమని సుశాంత్ అభిమానులు మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత బాలీవుడ్ లో నేపోటిజం పై తీవ్రమైన చర్చ జరుగుతుంది. బడా వారసుల సినిమాలను బ్యాన్ చేస్తామని సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related News