logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

బిగ్ ట్విస్ట్: ‘సుశాంత్ సింగ్ ను చంపింది రియానే..’

బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (34) మరణంపై ఆత్మహత్యే అని పోస్టుమార్టం రిపోర్టు, ఫోరెన్సిక్ నివేదిక వచ్చినా కూడా సుశాంత్ ఆత్మహత్యపై ఉన్న అనుమానాలు తొలగిపోవడం లేదు. తాజాగా ఈ కేసులో మరో కొత్త కోణం వెలుగు చూసింది. జూన్ 14న సుశాంత్ బాంద్రాలోని తన నివాసంలో ఉరివేసుకున్న స్థితిలో కనిపించాడు.

దీంతో కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మరింత లోతుగా విచారణ మొదలుపెట్టారు. ఈ కేసు మూతపడుతుందన్న నేపథ్యంలో సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సుశాంత్ ప్రేయసి రియా చక్రబర్తిపై పాట్నా పోలీసు స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. గతంలో సుశాంత్ మృతిపై తనకు ఎలాంటి అనుమానాలు లేవని కేకే సింగ్ మీడియాకు తెలిపిన సంగతి తెలిసిందే.

తాజాగా సుశాంత్ ను చంపేందుకు రియా సహకరించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ ఆత్మహత్యకు వారం రోజుల ముందు డబ్బు, నగలు తీసుకుని సుశాంత్ ఫ్లాట్ ఖాళి చేసి వెళ్లిందన్నారు. ఏడాది కాలంలో సుశాంత్ నుంచి రూ. 15 కోట్ల వరకు తీసుకుందన్నారు. సుశాంత్ చనిపోయే నాటికి కూడా అతని క్రెడిట్ కార్డు రియా దగ్గరే ఉందన్నారు.

ఈ నేపథ్యంలో రియాపై పాట్నా పోలీసులు సెక్షన్ 341(తప్పుడు సంయమనానికి శిక్ష), 342 (తప్పు నిర్బంధానికి శిక్ష), సెక్షన్ 380 (దొంగతనం), సెక్షన్ 406 (నమ్మక ద్రోహం), సెక్షన్ 420 (మోసం), సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం) కేసులు నమోదు చేసారు. ఈ విషయాలపై దర్యాప్తు చేసేందుకు నలుగురు పోలీసుల బృందం ముంబైకి వెళ్లినట్టు తెలిపారు.

Related News