logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

‘ఆర్ఆర్ఆర్’ విడుదలను అడ్డుకుంటాం.. రాజమౌళికి సుశాంత్ అభిమానుల సెగ!

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం అతని అభిమానులను తీవ్రంగా కలిచివేస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా సుశాంత్ మరణం పైనే చర్చ జరుగుతుంది. సుశాంత్ సొంత రాష్ట్రమైన బీహార్ లో అభిమానులు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం బాలీవుడ్ లో ఉన్న బంధు ప్రీతే సుశాంత్ ను బలి తీసుకుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే బాలివుడ్ ప్రముఖులు కరణ్ జోహార్, స్టార్ కిడ్స్ అలియా భట్ వంటి వారిని తీవ్రంగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. సుశాంత్ ఎవరో తెలియదని ఆమె తమ హీరోను అవమానించిందని మండిపడుతున్నారు. అంతేకాదు ఈ ఘటన తర్వాత ఏకంగా 4 లక్షల మంది అలియా భట్ ను సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసి షాకిచ్చారు. అయితే స్టార్ డైరెక్టర్ రాజమౌళికి కూడా ఇప్పుడు సుశాంత్ అభిమానుల సెగ మొదలయింది. అలియా భట్ ను ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన మీపై మాకు గౌరవం ఉంది. కానీ నటిగా ఎలాంటి అర్హతలు లేని అలియా భట్ ను మీ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవడం మాకు నచ్చలేదు. దయచేసి ఆమెను మీ సినిమా నుంచి తొలగించండి. లేదంటే ఆర్ఆర్ఆర్ సినిమాను ఉత్తరాదిలో విడుదల కానివ్వకుండా అడ్డుకుంటాం అంటూ సుశాంత్ అభిమానులు హెచ్చరిస్తున్నారు.

Related News