logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

సుశాంత్ పోస్టుమార్టం రిపోర్ట్.. అందుకే మరణించాడు..!

హీరో సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్యపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అయన కుటుంబీకులు. సుశాంత్ ది ఆత్మహత్య కాదని, హత్యేనని సంచలన ఆరోపణలు చేసారు. సుశాంత్ మృతిపై సీబీఐ దర్యాప్తు చేయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా నిన్న ఉదయం సుశాంత్ ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే.

అతని స్నేహితుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సుశాంత్ మృతదేహాన్ని పోస్టుమారం నిమిత్తం జుహు ప్రాంతంలోని మున్సిపల్ ఆసుపత్రికి తరలించారు. కాగా సుశాంత్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సోమవారం ఆయనకు సంబందించిన పోస్టుమార్టం రిపోర్ట్ ను వైద్యులు విడుదల చేసారు. మెడకు ఉరి బిగుసుకుపోవడం వల్ల ఊపిరాడక, నరాలు తెగిపోవడంతో సుశాంత్ మరణించినట్టుగా పోస్టుమార్టం రిపోర్ట్ లో తేలింది.

సుశాంత్ ది సహజ మరణమే అని హత్య కాదని రిపోర్ట్ ఆధారంగా వైద్యులు ధృవీకరించారు. ఈ నేపథ్యంలో సుశాంత్ కేసుపై దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసులు అతని ఫ్లాట్ లో డిప్రెషన్ కు సంబందించితిన్ మెడిసిన్ ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. హత్యగా భావించేందుకు ఎలాంటి అనుమానాస్పద ఆధారాలు లభించలేదన్నారు. నిన్న ఉదయం తన గదిలో నుంచి బయటకు వచ్చిన సుశాంత్ జ్యుస్ తాగి గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు.

అనంతరం బెడ్ షీట్ సహాయంతో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సుశాంత్ తన ఫ్లాట్ లో ముగ్గురు పనివాళ్ళతో సహా ఉంటున్నాడు. ఉదయం ఎంతకీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన పనివారు సుశాంత్ స్నేహితులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. అనంతరం తలుపులు పగలగొట్టి చూడగా సుశాంత్ ఉరి వేసుకుని కనిపించాడని అతని స్నేహితులు విలపిస్తున్నారు. కాగా సోమవారం సాయంత్రం సుశాంత్ కు ముంబైలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Related News