logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

హైదరాబాద్ లో సూర్యాపేట యువతిపై అత్యాచారం.. మృతి!

హైదరాబాద్ శివార్లలో మరో దారుణం చోటు చేసుకుంది. చదువుకోవడానికి సొంత ఉరి నుంచి నగరానికి వచ్చిన యువతి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. సూర్యాపేట జిల్లా చింతలపాలెం, పీక్లానాయక్ ఠాణాకు చేనిన యువతి నల్గొండ ప్రభుత్వ కాలజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ పూర్తి చేసింది.

పీజీ కౌన్సిలింగ్ కోసం గురువారం ఘట్కేసర్ కు బయలుదేరి వెళ్ళింది. ఆ మరుసటి రోజే యువతి ఆరోగ్య పరిస్థితి బాగాలేదని ఆమె ఉంటున్న హాస్టల్ నుంచి తల్లిదండ్రలకు ఫోన్ వచ్చింది. అక్కడకు చేరుకున్న ఆమె తల్లిదండ్రులు కూతురిని మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. కాగా యువతిపై అత్యాచారం జరిగినట్టుగా వైద్యులు వెల్లడించారు.

అప్పటికే బాధితురాలి ఆరోగ్య మరింత క్షీణించడంతో తిరిగి హైదరాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆదివారం రాత్రి యువతి మృతి చెందింది. హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రిలో యువతి మృతదేహానికి పోస్టుమారటం నిర్వహించారు. అయితే మృతురాలికి న్యాయం జరిగేదాకా మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదని తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. దీంతో మృతదేహం మార్చరీ వద్దనే ఉండిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కోదాడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related News