logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

రేగి పండ్లు తింటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి!

శీతాకాలంలో విరివిగా లభించే సీజనల్ ఫ్రూట్స్ రేగి పండ్లు. సంక్రాంతి పండగ వచ్చిందంటే ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తుంటాయి. భోగి రోజున చిన్న పిల్లలకు భోగి పళ్ళు వేయడం ఆచారంగా వస్తుంది. తలపై నుంచి పిల్లల శరీరాన్ని తాకుతూ కిందకి వేయడం వలన పిల్లలు అనారోగ్యం బారిన పడకుండా ఉంటారని ఇలాంటి ఒక సంప్రదాయాన్ని పాటిస్తుంటారు. సూర్యుడికి చిహ్నంగా వీటిని భావిస్తారు. రుచిలో తీపి, పులుపు కలగలిపినట్టుగా ఉండే ఈ పండ్ల వలన శరీరానికి కలిగే మేలు అంతా ఇంతా కాదు. 300 రకాల రోగాలనైనా తగ్గించగల ఔషధ గుణాలు ఈ పండ్లలో ఉన్నాయని పెద్దలు చెబుతారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో వీటిని పిలుస్తుంటాడు. ఒక్క మన దేశంలో దాదాపు 90 రకాల వెరైటీలను పండిస్తున్నారు.

రేగి పండ్లలో విటమిన్ సి, ఏ, పొటాషియం అధికంగా ఉంటాయి. శరీరానికి అవసరమైన రోగనిరోధక శక్తిని అందించడంలో రేగి పండ్లు ముందుంటాయి. ఇవే కాదు రేగి పండ్లలో ఉండే ఔషధ గుణాలు ఎన్నో అనారోగ్యాలను తగ్గించగలుగుతాయి. చైనీయులు కాలేయం శక్తివంతంగా పని చేయడానికి రేగి పండ్లతో తయారు చేసిన టానిక్ ను తాగుతుంటారు. నిద్ర లేమి సమస్యతో బాధపడేవారు కచ్చితంగా ఈ పండ్లను తినాలి. మల బద్ధకం, అజీర్తిని తగ్గించగలిగే శక్తి వీటికి ఉంది. రేగి పండ్లలో ఉండే గింజలు కూడా ఆరోగ్యానికి మేలు చేసేవే.

వీటిని పొడి చేసి నూనెలో కలిపి రాసుకుంటే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. నీళ్ల విరేచనాలతో బాధపడుతున్న వారు రేగి చెట్టు బెరడును తీసి కషాయంలా చేసి తాగడం వలన వెంటనే ఫలితం కనిపిస్తుంది. గుప్పెడు రేగి పండ్లను లీటరు నీటిలో వేసి సగం అయ్యే వరకు మరిగించాలి. ఈ నీటిని సీసాలో భద్రపరుచుకుని రోజు రాత్రి పడుకునే ముందు ఒక చెంచా తాగడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయాజనాలు ఉన్నాయి. ఇలా చేయడం వలన రక్తంలో గ్లుటామిక్ ఆమ్లాన్ని విడుదల అయ్యి మెదడు షార్ప్ గా పనిచేసేలా చేస్తుంది. తరచూ జ్వరం, జలుబుతో బాధపడేవారు ఈ సీజన్లో విరివిగా లభించే రేగి పండ్లను కచ్చితంగా తినాలి.

ఈ చెట్టు బెరడు రక్త విరేచనాలు, డయేరియాను కూడా తగ్గించగలవు. చర్మంపై బొబ్బలు, కురుపులు వచ్చి బాధిస్తున్నపుడు రేగు పండు ఆకులను నూరి చర్మంపై రాసుకోవడం వలన వెంటనే నయమవుతాయి. కఫము, పైత్యము, వాతం లాంటి సమస్యలు బాధిస్తుంటే రేగి పండ్లు తినాల్సిందే. బరువు పెరగాలనుకునే వారికి ఇవి సహాయపడతాయి. కండరాల నొప్పులను తగ్గించి శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వగల రేగు పండ్లను బలహీనంగా ఉన్నవారు తినడం చాలా మంచిది. రేగి పండ్లు కాలేయానికి సంబందించిన సమస్యలను నయం చేసి మరింత మెరుగ్గా పని చేసేలా చేయగలవని జపనీయులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది.

చాలా మంది రేగి పండ్లను పొట్టు తీసి తింటుంటారు. కానీ వీటిని పొట్టు తీయకుండా తినడం వలన కాలేయానికి చాలా మంచిది. ఇవి క్యాన్సర్ కారకాలకు వ్యతిరేకంగా పోరాడగలవు. రక్షత హీనత, ఆకలి లేకపోవడం, నీరసం వంటి సమస్యలను నివారిస్తుంది. కరోనా కారణంగా చాలా మందిలో శ్వాస నాళాల వాపు కనిపిస్తుంది. వీటికి రేగి పండ్లు దివ్య ఔషధం. గొంతునొప్పి, హిస్టీరియాకు కూడా రేగి పండ్లను వాడతారు. జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరిగేలా చేయగలవు. కానీ రేగి పండ్లను అతిగా తినాలనుకుంటే మాత్రం ఇవి విషంగా మారె ప్రమాదం ఉందని వైద్య శాస్త్రం పేర్కొంటుంది. తేనే రంగులో ఉన్నవి, పండిన రేగి పండ్లను మాత్రమే తినాలి. పచ్చి రేగి పండ్లను తినడం వలన అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది.

Related News