టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టులకు కొదువ లేదు. అందులో సురేఖావాణి లాంటి నటీమణులు అటు వెండి తెరపై ఇటు సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా ఉంటూ సందడి చేస్తున్నారు. కాగా ఇటీవల సింగర్ సునీత రెండో వివాహం ఎంత హాట్ టాపిక్ అయ్యిందో తెలిసిందే. దీంతో సురేఖా వాణి కూడా సునీత బాటలోనే రెండో పెళ్లి చేసుకుంటున్నారని మీడియాతో పాటుగా సోషల్ మీడియాలోనూ వార్తలు వచ్చాయి. 2019 లో సురేఖావాణి భర్త సురేష్ తేజ అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే.
ఆనాటి నుంచీ ఆమె కూతురే జీవితంగా బతుకుతున్నారు. టీనేజ్ లో ఉన్న కూతురితో వెకేషన్లకు వెళుతూ ఆ ఫోటోలను పోస్ట్ చేస్తుంటారు సురేఖా. అయితే కూతురు సుప్రీత ఒత్తిడితో ఆమె రెండో పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలను సురేఖా వాణి ఖండించారు కూడా. తాజాగా తల్లి పెళ్లి వార్తలపై సుప్రీతా ఫైర్ అయ్యింది. డబ్బుల కోసం ఒకరి పరువును, గౌరవాన్ని ఎలా దెబ్బతీస్తారని జర్నలిస్టులపై మండిపడింది.
డబ్బుల కోసం ఇలాంటి వార్తలను క్రియేట్ చేయవద్దని, కనీసం తమని తాము జర్నలిస్టులుగా చెప్పుకోవద్దని సుప్రీత ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదంతా ఆమె తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసి పరోక్షంగా ఇలాంటి వార్తలు రాసేవారికి కౌంటర్ ఇచ్చింది. కాగా కొంత కాలంగా సుప్రీతా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుందనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.