logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

తెలంగాణలో టపాసుల ‘బ్యాన్’ పై సుప్రీం కోర్టు కీలక తీర్పు..!

తెలంగాణ వ్యాప్తంగా బాణాసంచా విక్రయాలు, కాల్చడంపై నిషేధం విధిస్తూ నిన్న తెలంగాణ హై కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ తీర్పుతో తాను భారీగా నష్టపోతామంటూ బాణాసంచా విక్రయదారులు గగ్గోలు పెట్టారు. కోర్టు తీర్పుపై వారు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పుపై లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసారు.

దీంతో హై కోర్టు తీర్పుపై సుప్రీం ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హై కోర్టు తీర్పును సవరిస్తూ తెలంగాణలో గ్రీన్ క్రాకర్స్ ను కాల్చుకునే విధంగా అనుమతులు ఇచ్చింది. అదే విధంగా ఎన్జీటీ ఆదేశాలను అమలు చేయాలని పేర్కొంది. దీపావళి రోజు కేవలం 2 గంటలపాటు మాత్రమే టపాసులు కాల్చుకోవచ్చని, రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అనుమతులు ఇచ్చింది. సుప్రీం తీర్పుతో బాణాసంచా వ్యాపారులకు భారీ ఊరట లభించింది.

Related News