logo

  BREAKING NEWS

క‌డుపులో మంట ఎందుకొస్తుంది ? ఎలా త‌గ్గించుకోవాలి ?  |   ఇక మీ గ‌డ‌ప వ‌ద్ద‌కే బ్యాంకు వ‌స్తుంది.. కొత్త స‌ర్వీసు  |   బ్రేకింగ్‌: తెలుగుదేశం పార్టీ పార్ల‌మెంటు అధ్య‌క్షుల నియామ‌కం  |   ఆ ఛాన‌ల్ ప్రోగ్రాంకు రాక‌పోయి ఉంటే ఎస్పీ మ‌న‌తోనే ఉండేవారా..?  |   బీజేపీ జాతీయ క‌మిటీ నియామ‌కం.. న‌లుగురు తెలుగువాళ్ల‌కు చోటు  |   టీడీపీ, వైసీపీ శ్రేణుల‌ను ఉర్రూత‌లూగించిన ఆ రెండు పాట‌లు పాడింది బాలునే  |   సొంతిల్లు దానం.. స‌మాధిపై ఏం రాయాలో ముందే చెప్పిన బాలు  |   శానిటైజ‌ర్ ఎక్కువ‌గా వాడుతున్నారా..? ఈ ప్ర‌మాదాలు ఉన్నాయి జాగ్ర‌త్త‌..!  |   విషాద వార్త‌… ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఇక లేరు  |   తుమ్ములు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా ? ఈ చిట్కా పాటిస్తే త‌గ్గిపోతాయి  |  

తండ్రి ఆస్తిలో కూతుళ్ళ హక్కుపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు!

సాధారణంగా మన దేశంలో తండ్రి, తాతలు సంపాదించిన ఆస్తులకు కుమారుడినే వారసుడిగా భావిస్తారు. పెళ్లి చేసి పంపించడం మినహా కుమార్తెలకు ఆస్తి మొత్తంలో చిల్లిగవ్వ కూడా దక్కదు. కానీ కొంత మంది దయదలిచి ఆస్తిలో 10, 20 శాతాన్ని మహిళలకు పంచుతారు. కానీ ఇప్పుడు చట్టాలు మారాయి. మహిళలకు కూడా ఆస్తిలో సమాన హక్కులు కల్పించే విధంగా హిందూ వారసత్వ చట్టం- 2005 ను తీసుకువచ్చారు. అయినా ఇప్పటికీ మహిళలకు ఆస్థి పంపకాల్లో అన్యాయం జరుగుతుంది.

తాజాగా ఈ అంశంపై సుప్రీమ్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. చట్టం అమలులోకి వచ్చే నాటికి(2005, సెప్టెంబర్ 5) తండ్రి బతికి ఉన్నా, మరణించినా కూతుళ్ళకు తండ్రి ఆస్తిలో సమాన వాటా ఉంటుందని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. కుమారుడు కలిగి ఉన్నట్లే కూతురుకు కూడా తండ్రి ఆస్తిలో సమాన భాగం కలిగి ఉండాలి.

కుమార్తెలు కుటుంబాలకు జీవితాంతం ప్రియమైన వారేనని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. హిందూ వారసత్వ చట్టం, 1956 ప్రకారం కుమార్తెలకు తండ్రి పూర్వీకుల ఆస్తిలో ఎలాంటి వాటాలు పొందే హక్కు ఉండేది కావు. కానీ హిందూ అవిభాజ్య కుటుంబంలో తమ జీవనోపాధి కోసం ఆస్తిని కోరే హక్కు కల్పించబడింది. అయితే ఆస్తిలో సమానమైన హక్కును వాటాను అడిగే హక్కు వారికి లేదు.

కానీ 2005లో భారతీయ వారసత్వ (సవరణ) చట్టం ప్రకారం 1956 లోని భారతీయ వారసత్వ చట్టం లోని సవరణ ప్రకారం తన సోదరులతో సమానంగా కుమార్తెలు కూడా తండ్రి పూర్వీకుల ఆస్తిలో వాటాను పొందే హక్కు కల్పించబడింది.

Related News