logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

ఇంటికే మ‌ద్యం స‌ర‌ఫ‌రా..? సుప్రీం కీల‌క సూచ‌న‌లు

దేశ‌వ్యాప్తంగా మ‌ద్యం అమ్మ‌కాలు ప్రారంభించ‌డంతో ప్ర‌జ‌లు భౌతిక దూరం పాటించ‌డం లేద‌ని, వెంట‌నే మ‌ద్యం అమ్మ‌కాల‌ను నిలిపివేయాల‌ని దాఖ‌లైన ప్ర‌జాప్ర‌యోజ‌న వాజ్యంపై సుప్రీం కోర్టు విచార‌ణ జ‌రిపింది. మ‌ద్యం అమ్మ‌కాలు సాధార‌ణ ప్ర‌జ‌ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌ని, మ‌ద్యం దుకాణాలు త‌క్కువ‌గా ఉండ‌టం, మ‌ద్యం సేవించే వాళ్లు ఎక్కువ‌గా ఉండ‌టంతో భౌతిక దూరం పాటించ‌డం లేద‌ని పిటీష‌న‌ర్ త‌ర‌పు న్యాయ‌వాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

లాక్‌డౌన్ స‌మ‌యంలో మ‌ద్యం దుకాణాలు తెర‌వ‌డం చ‌ట్ట విరుద్ధ‌మ‌ని ఆయ‌న వాదించారు. ఈ వాద‌న‌ల‌పై స్పందించిన సుప్రీం కోర్టు మ‌ద్యం దుకాణాలు మూసి వేయాల‌ని ఆదేశాలు ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని స్ప‌ష్టం చేసింది. అయితే, భౌతిక దూరం పాటించ‌డం కూడా త‌ప్ప‌ని స‌రి అయినందున మ‌ద్యం హోం డెలివ‌రీ చేసే దిశ‌గా రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఆలోచ‌న చేయాల‌ని సుప్రీం కోర్టు సూచించింది. కాగా, కేంద్రం మ‌ద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమ‌తించ‌డంతో దేశ‌వ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో మ‌ద్యం దుకాణాలు ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే.

Related News