కేంద్ర ప్రభత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు నేడు విచారణ జరిపింది. ఈమేరకు సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. వ్యవసాయ చట్టాలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ చట్టాలపై కోర్టు తీర్పు వచ్చేంతవరకు చట్టాలను నిలిపివేయాలని ధర్మాసనం పేర్కొంది. సాగు చట్టాలపై రైతుల సమస్యలను పరిష్కరించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలనీ కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో కోర్టు తదుపరి తీర్పు వెలువడేంతవరకు నూతన వ్యవసాయ చట్టాల అమలు నిలిచిపోనుంది.
నలుగురు సంభ్యులతో ఏర్పాటు చేసిన కమిటీ ఈ చట్టాలపై అనుకూల ప్రతికూల వాదనలు విన్న అనంతరం ఆ నివేదికను సుప్రీం కు సమర్పించనుంది. కమిటీ అందించిన నివేదిక ప్రకారం సుప్రీం ఈ అంశంపై పూర్తి తీర్పును వెలువడించే అవకాశం ఉంది. కమిటీ సభ్యులుగా అశోక్ గలాటి, అనిల్ గన్వత్, ప్రమోద్ కుమార్ జోషి, హెచ్ ఎస్ మన్తో ఉండనున్నారు.
కాగా కమిటీ ముంద తమ వాదనలు వినిపించడానికి రైతులు సిద్ధంగా లేరని వారి తరపు అడ్వొకేట్ కోర్టుకు తెలుపగా.. ధర్మాసనం మాత్రం రైతు సంఘాలు కమిటీ ముందకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. కమిటీ రైతులకు కేంద్రానికి మధ్య మధ్యవర్తిత్వం చేయదని స్పష్టం చేసింది. కమిటీ నివేదికను సుదీర్ఘ సమయం పాటు పరిశీలించిన తర్వాతనే ఈ అంశంపై అంతిమ తీర్పు వెల్లడిస్తామని సుప్రీం రైతు సంఘాలకు భరోసానిచ్చింది.