logo

  BREAKING NEWS

పీఆర్సీ నివేదిక లీక్: తెలంగాణ సర్కార్ సీరియస్..నిరాశలో ఉద్యోగులు!  |   బ్రేకింగ్: మళ్ళీ రాజకీయాల్లోకి మెగాస్టార్.. నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు!  |   ఎర్రకోట అల్లర్లు: పంజాబీ నటుడు దీప్ సిద్ధూ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!  |   అంబానీ సెకను ఆదాయం.. సామాన్యుడికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా?  |   ప‌ద్మ‌విభూష‌ణ్‌, ప‌ద్మ‌భూష‌ణ్‌, ప‌ద్మ‌శ్రీ అవార్డుల‌తో ఎంత డ‌బ్బు ఇస్తారో తెలుసా ?  |   హింసాత్మకంగా మారిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ  |   ఏపీ పంచాయతీ వార్: జగన్ సర్కార్ ఆదేశాలకు ఎస్ఈసీ నో..!  |   తెలంగాణలో కొత్త పార్టీ.. క్లారిటీ ఇచ్చిన వైఎస్ షర్మిల!  |   సుప్రీం తీర్పు: అధికారులతో సీఎం జగన్ అత్యవసర సమావేశం!  |   పంచాయతీ ఎన్నికలు.. ఉద్యోగ సంఘాలకు నిమ్మగడ్డ షాక్!  |  

రైతుల నిరసనలు: కేంద్రానికి సుప్రీం షాక్!

కేంద్రానికి వ్యతిరేకంగా వ్యవసాయ చట్టాలపై రైతులు ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ అంశం పై ఈరోజు సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రైతుల నిరసనలపై అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. రైతులకు నిరసన తెలిపే హక్కుందని దానిని అడ్డుకునే అధికారం ఎవ్వరికీ లేదని సుప్రీం వ్యాఖ్యానించింది.

అయితే ఆందోళనలు ఇతరుల ప్రాణాలకు నష్టంచేసేవిగా ఉండకూడదని ఢిల్లీని నిర్బంధించడం వల్ల ప్రజలు ఆకలితో అలమటిస్తారని మీ ఉద్దేశ్యాలు నెరవేరాలంటే అది కేవలం చర్చలతోనే సాధ్యపడుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది.జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ అంశంపై దాఖలైన పలు పిటిషన్లలో ముందుగా రైతుల నిరసనలపై దాఖలైన పిటిషన్లను విచారిస్తామని చట్టాలను రద్దు చేసే పిటిషన్లపై తర్వాత విచారణ చేపడతామని సుప్రీం పేర్కొంది.

కాగా సమస్యను పరిష్కరించుకోవడానికి ఇది సరైన మార్గం కాదని చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని కోర్టు రైతు సంఘాలకు సూచించింది. అలాగే కేంద్రానికి కూడా సుప్రీం కొన్ని సూచనలు చేసింది. రైతులు అభ్యంతరం తెలుపుతున్న ఈ వ్యవసాయ చట్టాల అమలును నిలిపివేస్తే రైతులు కేంద్రంతో చర్చలు జరిపే అవకాశం ఉందని కేంద్రానికి షాకిచ్చింది కోర్టు.

రైతుల తో చర్చలు జరిపేందుకు స్వతంత్య్ర కమిటీని ఏర్పాటు చేయాలని మరోసారి కేంద్రానికి సూచించింది. అయితే దీనిపై రైతు సంఘాల అభిప్రాయాలను కూడా తాము తెలుసుకోవాలని అనుకుంటున్నామని సుప్రీం వ్యాఖ్యానించింది. కాగా ఈ విచారణను వాయిదా వేసింది కోర్టు. తదుపరి విచారణను వెకేషన్ బెంచ్ చేపట్టనుంది.

Related News