logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట..!

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. రాష్ట్రంలో కొత్త సచివాలయ భవన నిర్మాణాన్ని కేసీఆర్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. దీనిపై ఏడాది కాలంగా జరుగుతున్న కోర్టు వివాదాలకు తెరపడి ఇటీవల పాత సచివాలయ భవనాన్ని కూల్చేందుకు కొత్త భవనాన్ని నిర్మించేందుకు తెలంగాణ హై కోర్టు ఆమోదం తెలిపింది.

ఈ నేపథ్యంలో 132 ఏళ్ల చరిత్ర కలిగిన సచివాలయ కూల్చివేతను నిలిపేయాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. జూన్ 29న హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని జీవన్ రెడ్డి పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ పై శుక్ర‌వారం తెలంగాణ సచివాలయం కూల్చివేతపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్.కె కౌల్, జస్టిస్ ఎం.ఆర్ షాతో కూడిన ధర్మాసనం జీవం రెడ్డి పిటిషన్ ను కొట్టివేసింది. తెలంగాణ సచివాలయ కూల్చివేత, భవన నిర్మాణం పూర్తిగా ప్రభుత్వానికి చెందిన వ్యవహారమని అందులో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోదని స్పష్టం చేసింది. కోర్టు తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఊరట లభిచింది.

Related News