logo

  BREAKING NEWS

గుడ్ న్యూస్‌: క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ వచ్చేసింది..!  |   వైఎస్సార్‌, చంద్ర‌బాబు స్నేహ‌బంధంపై సినిమా  |   క‌రోనా ఖతం అయ్యే డేట్ చెప్పిన బిల్ గేట్స్‌  |   నిజంగానే పాపం త‌గిలిన‌ట్లుంది… క‌రోనాతో ఆ ఎస్సై మృతి  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వల్ల కూడా ఆ ప‌ని కాదు.. కొడాని నాని హాట్ కామెంట్స్‌  |   బ్రేకింగ్‌: మాజీ రాష్ట్ర‌ప‌తికి క‌రోనా పాజిటీవ్‌  |   క‌న్న‌డ దంప‌తుల ధైర్యం… పీఓకేలోని శార‌దాపీఠం నుంచి అయోధ్య‌కు ప‌విత్ర మ‌ట్టి  |   పాక్ నుంచి వ‌చ్చిన ఒకే కుటుంబంలో 11 మంది ఆత్మ‌హ‌త్య‌  |   విజ‌య‌వాడ కోవిడ్ సెంట‌ర్‌లో అగ్ని ప్ర‌మాదానికి కార‌ణాలివే..!  |   ప్లాస్మా దానం అంటే ఏమిటి ? ఎవ‌రు చేయాలి ? ఎలా చేయాలి ?  |  

కేరళ పద్మనాభ స్వామి ఆలయం పై సుప్రీం కీలక తీర్పు! ఆరో గది తెరుస్తారా?

కేరళ అనంత పద్మనాభ స్వామి ఆలయ నిర్వహణ బాధ్యతలను సుప్రీం ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. ఆలయ బాధ్యతలు, నిర్వహణా విషయాలు ట్రావెన్కోర్ రాజ కుటుంబీలకు అప్పగించడాన్ని సుప్రీం సమర్థించింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ మల్హోత్రాల ధర్మాసనం రాజకుటంబానికి అనుకూలంగా తుది తీర్పును వెలువరించింది.

త్రివేండ్రం జిల్లా న్యాయమూర్తి ఆధ్వర్యంలో రాజకుటుంబానికి ప్రభుత్వానికి అనుసంధానంగా ఓ కమిటీని కూడా నియమిస్తున్నట్టుగా తెలిపింది. కొత్త కమిటీని నియమించే వరకు ప్రస్తుతం ఉన్న కమిటీని కొనసాగించాలని తెలిపింది. కాగా 2011 జనవరి 31న అనంత పద్మనాభ స్వామి ఆలయ సంపద, నిర్వహణ బాధ్యతలను ట్రావెన్కోర్ రాజవంశం నుంచి స్వాధీనం చేసుకోవాలని కేరళ హై కోర్టు తీర్పునిచ్చింది. హై కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ట్రావెన్కోర్ రాజవంశస్తులు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కాగా ఈ ఆలయ వివాదంపై గతేడాది ఫిబ్రవరిలోనే సుప్రీం విచారణ పూర్తి చేసినప్పటికీ నేడు తీర్పును వెలువరించింది.

2011 లో కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని నేలమాళిగల్లో 5 లక్షల కోట్ల భారీ సంపద బయటపడింది. దీంతో ఈ పురాతన ఆలయం తిరుపతి వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని వెనక్కి నెట్టి దేశంలోనే అత్యంత సంపద కలిగిన ఆలయంగా అవతరించింది. కాగా ఈ ఆలయంలోని ఆరో గదిని తెరిచే విషయంపై వివిధ రకాల ప్రచారాలు జరిగాయి.

ఈ గది తలుపులు తెరిస్తే కాల నాగు సర్పం కాటుకు మరణిస్తారని, అరిష్టమని అన్నారు. అయితే ఈ ఆలయ గదికి నాగ బంధం ఉండటం, తలుపులు తెరిచే సమయంలో ఒకరు మరణించడంతో ఎవ్వరూ ఆ సాహసం చేయలేకపోయారు. అయితే ఈ గదిని తెరిచే విషయంపై నిర్ణయం తీసుకునే అధికారం ఇప్పుడు ట్రావెన్కోర్ రాజవంశీకుల చేతికి చేరింది. ఇప్పుడు మరోసారి ఈ ఆరో గది తలుపులు తెరిచే విషయంపై చర్చ మొదలైంది. దీనిపై వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది తెలియాల్సి ఉంది.

Related News