logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

పూరి జగన్నాథుని రథయాత్రకు సుప్రీం అనుమతి.. కానీ!

శతాబ్దాలుగా వస్తున్నఆనవాయితీని కొనసాగిస్తూ సుప్రీం ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది. కరోనా నేపథ్యంలో ఓడిశాలోని పూరి జగన్నాథుని రథ యాత్రపై ధర్మాసనం స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ నెల 18 న జరిగిన విచారణలో భాగంగా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో యాత్రకు అనుమతిస్తే ఆ జగన్నాథుడే తమను క్షమించడని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కాగా ఈ తీర్పును పునః సమీక్షించాలని కోరుతూ సుప్రీం లో పిటిషన్ దాఖలు చేయగా.. దీనిపై ఎస్ ఎ బొబ్దే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఈ నేపథ్యంలో పూరి జగన్నాథుని రథ యాత్రను కొనసాగించవచ్చని సుప్రీం కీలక తీర్పునిచ్చింది. అయితే కొన్ని షరతులను కూడా విధించింది. రథయాత్రను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆదేశించింది. పెద్ద సంఖ్యలో భక్తులు రాకుండా చూసుకోవాలని ప్రజారోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం తగదని హెచ్చరించింది. ఒక్క పూరిలో మాత్రమే రథ యాత్ర నిర్వహించాలని ఇంకా ఏ ప్రాంతంలోనూ నిర్వహణకు అనుమతి లేదని తెలిపింది.

కాగా ఈ కేసు విచారణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నిబంధలను పాటిస్తూ యాత్ర నిర్వహిస్తామని, యాత్రలో పాల్గొనే ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు నిర్వహించి నెగిటివ్ అని తేలితేనే అనుమతిస్తామని వివరించింది. రేపటి రోజున జగన్నాథుడు ఉత్సవ విగ్రహం రూపంలో బయటకు రాకుంటే ఆచారం ప్రకారం మరో 12 ఏళ్ల దాకా యాత్రను నిర్వహించకూడదని అందువల్ల యాత్రకు అనుమతులు ఇవ్వాలని కోరింది. దీనిపై విచారణ జరిపిన అనంతరం భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని షరుతలతో కూడిన అనుమతులని ధర్మాసనం జారీ చేసింది.

Related News