logo

  BREAKING NEWS

తుమ్ములు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా ? ఈ చిట్కా పాటిస్తే త‌గ్గిపోతాయి  |   జ‌గ‌న్‌ను ఓడించే కుట్ర‌..? కొడాలి నాని పాత్ర‌..?  |   బ్రేకింగ్‌: జ‌గ‌న్ ఇంటి ముట్ట‌డి.. హైద‌రాబాద్‌, తిరుప‌తిలో ఉద్రిక్త‌త‌‌  |   బ్రేకింగ్: డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో మ‌హేష్ బాబు స‌తీమ‌ణి న‌మ్ర‌త పేరు  |   అమెరికా నుంచి ఎలా వ‌చ్చింది..? ‘కాంగ్రెస్ గ‌డ్డి’ అని ఎందుకు పిలుస్తారు ?  |   తెలుగుదేశం పార్టీకి కొత్త అధ్య‌క్షుడి పేరు ఖ‌రారు  |   ఇక నుంచి ‘యాదాద్రి’ రైల్వే స్టేష‌న్‌  |   హ‌రీష్ రావు వ‌ర్సెస్ ర‌ఘునంద‌న్‌రావు  |   ఈ చిన్న ప‌ని చేస్తే 15 నిమిషాల్లో త‌ల‌నొప్పి మాయం  |   రూ.15,000 లోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు ఇవే  |  

డిగ్రీ, పీజీ పరీక్షలపై వీడిన సందిగ్దత.. సుప్రీం కీలక తీర్పు..!

దేశవ్యాప్తంగా డిగ్రీ, పీజీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షల నిర్వహణపై సుప్రీం ధర్మాసనం తీర్పు కీలకంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే నీట్, జేఈఈ పరీక్షలను నిర్వహించవచ్చని సుప్రీం తీర్పునిచ్చింది. గతంలో డిగ్రీ, పీజీ విద్యార్థులకు కూడా సెప్టెంబర్ 30లోపు ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాలని యూజీసీ (UGC) దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలకు స్పష్టం చేసింది.

మహారాష్ట్రతో పలు రాష్ట్రాలు విద్యార్థులకు కరోనా కాలంలో పరీక్షలు నిర్వహించేందుకు సుముఖంగా లేవు. కానీ పలు యూనివర్సిటీలు పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ప్రకటించేసాయి. తాజాగా యూజీసీ జారీ చేసిన ఈ మార్గదర్శకాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. సెప్టెంబర్ 30 లోపు డిగ్రీ, పీజీ పరీక్షలు నిర్వహించాలన్న యూజీసీ నిర్ణయాన్ని సుప్రీం సమర్థించింది.

దీనిపై దాఖలైన పిటిషన్ ను కొట్టివేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఆఖరి సంవత్సరం పరీక్షలు రాయకుండా ఎవరినీ ప్రమోట్ చేయవద్దని ఆదేశించింది. కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్న రాష్ట్రాలు అవసరమైతే యూజీసీని సంప్రదించి పరీక్షల గడువు పెంచాలని కొరవచ్చునని తెలిపింది.

Related News