logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

‘కోర్టు ధిక్కార’ కేసులో న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కు శిక్ష ఖరారు!

కోర్టు ధిక్కార కేసులో సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కు సుప్రీం కోర్టు శిక్షను ఖరారు చేసింది. కోర్టు ధిక్కార నేరాకిని పాల్పడినట్టుగా ధర్మాసనం తేల్చింది. రూపాయి జరిమానా విధిస్తూ సుప్రీం తీర్పునిచ్చింది. సెప్టెంబర్ 15లోపు రూపాయి జరిమానాను చెల్లించలేని పక్షంలో మూడు నెలల జైలు శిక్షతో పాటుగా మూడేళ్ళ ప్రాక్టీస్ పై నిషేధం విధిస్తామని ధర్మాసనం పేర్కొంది.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డేతో పాటుగా మరికొందరు గత సీజేఐలపై ప్రశాంత్ భూషణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఈ మేరకు ప్రశాంత్ భూషణ్ చేసిన వ్యాఖ్యలను ‘కోర్టు ధిక్కార మరియు పరువు నష్టం’ కింద పరిగణించింది. దీనిపై క్షమాపణలు కోరాలని ప్రశాంత్ భూషణ్ ను పలుమార్లు హెచ్చరించిన ధర్మాసనం అయినా వినకపోవడంతో ఈ కేసుపై విచారణ చేపట్టింది.

ఈ ఏడాది జూన్ 27 నుంచి 29 తేదీల లోపు తేదీల్లో ప్రశాంత్ భూషణ్ సోషల్ మీడియాలో చేసిన వివాదాస్పద ట్వీట్లను సుమోటోగా తీసుకుంది. అటార్నీ జనరల్ కేకే వేణుగోవుపాల్ వాదనలు విన్న అనంతరం రూపాయి జరిమానా విధిస్తూ సుప్రీం తీర్పునిచ్చింది. సుప్రీం తీర్పుపై ప్రశాంత్ భూషణ్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది.

Related News