ప్రభాస్ అభిమానులకే కాకుండా మొత్తం సినీ ప్రేక్షకులకు మాంచి కిక్కిచ్చే వార్త ఒకటి బయటకు వచ్చింది. కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా సలార్(Salaar) అనే టైటిల్‌తో సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా కేజీఎఫ్ లెవల్లో భారీగా ఉంటుందని అందరూ అనుకుంటున్నారు.
అయితే, అందరి అంచనాలను మించి ఈ సినిమా ఉంటుందని సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్న భవన్ గౌడ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. కేజీఎఫ్ సినిమా కంటే సలార్(Salaar) మూడు రెట్లు భారీగా ఉంటుందని ఆయన చెప్పాడు. సలార్(Salaar) సినిమాకు మంచి నిర్మాణ దొరికాడని, ఇది తమ అదృష్టమని చెప్పుకొచ్చాడు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపైన విజయ్ అనే నిర్మాత సలార్(Salaar)ను సినిమాను నిర్మిస్తున్నారు.