‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్. మొదటి సినిమానే అయినా తన నటనతో ప్రేక్షకులందరినీ ఇంప్రెస్ చేసాడు. ఉప్పెన సినిమా ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. 5 రోజుల్లోనే రూ.43 కోట్ల నెట్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఎక్కడా చూసినా వైష్ణవ తేజ్ పేరే వినిపిస్తుంది.
అయితే మెగా ఫ్యామిలీ నుంచి ఏ హీరో మెగా బ్రాండ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే వైష్ణవ తేజ్ పేరు మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. వైష్ణవ తేజ్ పేరు ముందు ‘పంజా’ ఉండటం వల్ల దాని అర్థం ఏమిటని చాలా మంది అభిమానులకు ఒక సందేహం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా పేరు కూడా పంజానే. గతంలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ తన పేరులో కొన్ని మార్పులు చేసుకుని సాయి తేజ్ గా మార్చుకున్న విషయం తెలిసిందే.
కానీ వైష్ణవ తేజ్ కు మాత్రం పంజా అనేది తన తండ్రి ఇంటి పేరు మీదగా వచ్చింది. తేజ్ సోదరులిద్దరూ మెగాస్టార్ కు చెల్లెలి కుమారులన్న విషయం తెలిసిందే. వైష్ణవ తేజ్ తల్లి కొన్ని వ్యక్తిగత కారణాలతో భర్తతో విడిపోయారు. తన తండ్రి స్వగ్రామం భీమవరం దగ్గరలోని వేమవరం. ఆ ఊరి నిండా పంజా అనే ఇంటి పేరు గలవారు ఎక్కువగా ఉండటంతో ఆ ఊరిని పంజావేమవరం అని పిలుస్తారు. ఆ విధంగా వైష్ణవ తేజ్ తండ్రి నుంచి పంజా అనేది వారి ఇంటి పేరుగా స్థిరపడిపోయింది. సాయి ధరమ్ తేజ్ మాత్రం ఇంటి పేరును చేర్చుకోలేదు.