logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రతి ఏటా భారతీయ సినీరంగానికి విశేష సేవలు అందించిన వారిని వరిస్తుంది. అయితే ఈ పురస్కారాన్ని అందుకునేవారు చాలా అరుదుగా ఉంటారు. ఎవరికైనా ఈ అవార్డు దక్కింది అంటే వారు అందించిన ఎనలేని సేవలకు గుర్తుగా దానిని భావిస్తారు. అయితే ఈ అవార్డును భారతీయ సినిమాకు పితామహుడిగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది.

దాదా సాహెబ్ ఫాల్కే అసలు పేరు ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే. భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉన్న సమయంలో మహారాష్ట్రలోని టింబక్ అనే ఊరిలో 1870 ఏప్రిల్ 30 న ఈయన జన్మించారు. తొలి భారతీయ సినిమాను రూపొందించిన ఘనత ఫాల్కే సొంతం. చిన్ననాటి నంచి సృజనాత్మకత, కళలపై విపరీతమైన ఇష్టం పెంచుకున్న ఆయన విధ్యభయాసాన్ని కూడా ఫొటోగ్రఫీ డ్రామా, లిథోగ్రాఫీ లాంటి సబీజెక్టులతో పూర్తి చేశారు. కొంత కాలం పెయింటర్ గా, సినిమా సెట్లకు డిజైనర్ గా కూడా పని చేశారు. అయితే 1910లో ఏసుక్రీస్తు జీవితం ఆధారంగా రూపొందిన ‘ది లైఫ్ ఆఫ్ క్రైస్ట్’ అనే మూకీ సినిమాను ఆయన చూసారు.

ఈ సినిమా ఆయన జీవితాన్నే మలుపు తిప్పింది. తాను కూడా హిందూ దేవుళ్ళ పై ఇలాంటి సినిమాలను తీయాలని నిర్ణయించుకున్నారు. సినిమాలపై పరిశోధనలు చేయడానికి లండన్ వెళ్లి మరింత నైపుణ్యం పెంచుకున్నారు. ఆ తర్వాత 1913 లో భారత్ కు వచ్చిన ఆయన నిర్మాత, దర్శకుడిగా మారి రాజా హరిశ్చంద్ర అనే మూకీ సినిమాను తెరకెక్కించారు. ఆ తర్వాత హిందుస్థాన్ ఫిలిం కంపెనీని స్థాపించి లంకా దహన్, శ్రీ కృష్ణ జన్మ, సైరంధ్రి, శకుంతల లాంటి ఎన్నో పౌరాణిక సినిమాలను తీశారు. ఇవన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఇలా మొత్తం 95 సినిమాలను, 26 షార్ట్ ఫిలిమ్స్ ను తెరకెక్కించారు. అయితే జీవితంలో ఎంత సంపాదించారో అదంతా తిరిగి పరిశ్రమ కోసమే ఖర్చు చేసారు. ఎప్పుడైతే సినిమాలను సౌండ్ ఎఫెక్ట్స్ ఉపయోగించి తీయడం మొదలు పెట్టారో ఆనాటి నుంచి దాదా సినిమాలు మరుగున పడిపోయాయి. మూకీ సినిమాలకు ఆదరణ తగ్గిపోవడంతో ఆ తర్వాత దాదా సినిమాలు తీయడం మానేశారు. కానీ అప్పటివరకు హాలీవుడ్ పరిశ్రమకు మాత్రమే పరిమితమైన సినిమా అనే కాన్సెప్ట్ ను భారతీయులకు పరిచయం చేసిన వ్యక్తిగా దాదా సాహెబ్ ఫాల్కే పేరు చరిత్రలో నిలిచిపోయింది. 1944 ఫిబ్రవరి 16న నాసిక్‌లో దాదా మరణించారు.

మన దేశంలో ఈ అవార్డును అందుకున్న తెలుగు ప్రముఖులలో పైడి జైరాజ్, ఎల్వీ ప్రసాద్, అక్కినేని నాగేశ్వరరావు, డి.రామానాయుడు, కె. విశ్వనాథ్ లాంటి వారు ఉన్నారు. కాగా గతంలో అమితాబ్ బచ్చన్ ఈ అవార్డు వరించగా ఈ ఏడాది సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఈ అవార్డును కేంద్రం ప్రకటించింది.

Related News