logo

  BREAKING NEWS

చంద్ర‌బాబు స‌వాల్‌కు సై అంటున్న జ‌గ‌న్‌..? రెఫ‌రెండంకు సిద్ధం.?  |   టీడీపీ – వైసీపీ వ‌ర్గాల మ‌ధ్య చిచ్చుపెట్టిన ఆష్టాచెమ్మా ఆట‌..!  |   తెలంగాణ‌లో మ‌రో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి క‌రోనా పాజిటీవ్‌  |   పంతం నెగ్గించుకున్న నిమ్మ‌గ‌డ్డ‌.. మ‌ళ్లీ కుర్చీలోకి..!  |   ఆవిరి పీలిస్తే క‌రోనా వైర‌స్ చ‌నిపోతుందా..? అస‌లు నిజం ఇది..!  |   బ్రేకింగ్: కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్!  |   బోది ధ‌ర్ముడిని చంపేశారా..? మ‌రి సైనికుడికి క‌నిపించింది ఎవ‌రు..?  |   విశాఖ షిప్ యార్డు బాధితులకు భారీ సాయం ప్రకటించిన ప్రభుత్వం  |   రాజధానిపై ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు..!  |   బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్య‌వ‌ర్గాన్ని ప్ర‌క‌టించిన బండి సంజ‌య్‌  |  

విశాఖకు ఎగ్జిక్యూటివ్ కాపిటల్.. శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ బిశ్వబ్యూషన్ హరిచందన్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. మూడు రాజధానుల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బిల్లులకు గవర్నర్ ఆమోదం లభించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆ చట్టాలకు సంబందించిన గెజిట్ నోటిఫై చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అందరి దృష్టి విశాఖపైనే ఉంది.

విశాఖను పరిపాలనా రాజధానిగా మార్చడానికి త్వరలోనే శంకుస్థాపన జరగనుందని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆగస్టు 15వ తేదీనే శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైందని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయంపై ఏపీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ స్పందించారు. మూడు రాజధానులతో ఉత్తరాంధ్ర వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు.

శ్రావణ మాసంలోనే విశాఖలో రాజధాని శంకుస్థాపన కు పనులు ఉంటాయని ఆయన స్పష్టం చేసారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15 వ తేదీన శంకుస్థాపనకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసినట్టు ప్రకటించారు. ముందుగా విశాఖలో పాలనకు అనువుగా ఉన్న భవనాలను ఎంపిక చేసి రాజధానిని తరలిస్తామని ఆ తర్వాత మిగిలిన అంశాలపై దృష్టిపెడతామన్నారు.

మరోవైపు విశాఖపై ఏపీ పోలీస్ శాఖ ఫోకస్ పెట్టింది. విశాఖలో పరిపాలన రాజధానికి అనుకూలమైన భవనాలు. మౌలిక వసతులు, భద్రత తదితర అంశాలపైసీపీ ఛైర్మెన్ గా 8 మంది సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. రెండు వారాల్లోగా దీనిపై నివేదిక ఇవ్వాలని డీజీపీకి ఆదేశాలను జారీ చేసారు.

Related News