logo

  BREAKING NEWS

క‌డుపులో మంట ఎందుకొస్తుంది ? ఎలా త‌గ్గించుకోవాలి ?  |   ఇక మీ గ‌డ‌ప వ‌ద్ద‌కే బ్యాంకు వ‌స్తుంది.. కొత్త స‌ర్వీసు  |   బ్రేకింగ్‌: తెలుగుదేశం పార్టీ పార్ల‌మెంటు అధ్య‌క్షుల నియామ‌కం  |   ఆ ఛాన‌ల్ ప్రోగ్రాంకు రాక‌పోయి ఉంటే ఎస్పీ మ‌న‌తోనే ఉండేవారా..?  |   బీజేపీ జాతీయ క‌మిటీ నియామ‌కం.. న‌లుగురు తెలుగువాళ్ల‌కు చోటు  |   టీడీపీ, వైసీపీ శ్రేణుల‌ను ఉర్రూత‌లూగించిన ఆ రెండు పాట‌లు పాడింది బాలునే  |   సొంతిల్లు దానం.. స‌మాధిపై ఏం రాయాలో ముందే చెప్పిన బాలు  |   శానిటైజ‌ర్ ఎక్కువ‌గా వాడుతున్నారా..? ఈ ప్ర‌మాదాలు ఉన్నాయి జాగ్ర‌త్త‌..!  |   విషాద వార్త‌… ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఇక లేరు  |   తుమ్ములు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా ? ఈ చిట్కా పాటిస్తే త‌గ్గిపోతాయి  |  

ఆవిరి పీలిస్తే క‌రోనా వైర‌స్ చ‌నిపోతుందా..? అస‌లు నిజం ఇది..!

క‌రోనా వైర‌స్ ప్ర‌భావం మొద‌లైన నాటి నుంచి సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు మొద‌ల‌య్యాయి. క‌రోనా భ‌యంతో ఎవ‌రు ఏం చెప్పినా ప్ర‌జ‌లు ఎక్కువ‌గా న‌మ్మేసి, వారు చెప్పిన‌ట్లుగా చేసేస్తున్నారు. ఆవిరి తీసుకోవడం ద్వారా క‌రోనా వైర‌స్ చ‌నిపోతుంద‌నే ఒక ప్ర‌చారం కూడా చాలా రోజులుగా సాగుతోంది. చాలా మంది ఈ ప్ర‌చారాన్ని న‌మ్మి ప్ర‌తీ రోజూ మూడు పూట‌లా ఆవిరి తీసుకుంటున్నారు. ఇప్పుడు ఓ ప‌రిశోధ‌న కూడా ఆవిరి తీసుకోవ‌డం ద్వారా క‌రోనా వైర‌స్ బాధితులు కోలుకుంటున్నార‌ని చెబుతోంది.

ముంబ‌యికి చెందిన సెవెల్ హిల్స్ ఆసుప‌త్రి వైద్యులు మూడు నెల‌ల పాటు ప‌రిశోధ‌న జ‌రిపి స్టీమ్ థెర‌ఫీ అంటే ఆవిరి చికిత్స క‌రోనా వైర‌స్‌కు దివ్యౌష‌దంలా ప‌ని చేస్తోంద‌ని చెప్పారు. ఆ ఆసుప‌త్రికి చెందిన డా.దిలిప్ ప‌వార్ ఆధ్వ‌ర్యంలోని వైద్య బృందం క‌రోనా బాధితుల‌కు ఈ చికిత్స అందించి, ప‌రిశోధ‌న‌లు జ‌రిపింది. ముందుగా 105 మంది క‌రోనా బాధితుల‌ను ల‌క్ష‌ణాలు ఉన్న వారిని ఒక గ్రూపుగా, ల‌క్ష‌ణాలు లేని వారిని మ‌రో గ్రూపుగా విభ‌జించారు.

వీరికి ఆవిరి చికిత్స అందించారు. ల‌క్ష‌ణాలు లేని క‌రోనా పాజిటీవ్ పేషెంట్లు రోజుకు మూడుసార్లు ఆవిరి తీసుకుంటే వేగంగా కోలుకుంటున్నార‌ని ఈ ప‌రిశోధ‌న చెబుతోంది. కేవ‌లం మూడు రోజుల్లోనే వీరు క‌రోనా నుంచి కోలుకున్నార‌ని అంటున్నారు. ల‌క్ష‌ణాలు తీవ్రంగా ఉన్న వారు కూడా ఆవిరి చికిత్స‌తో కోలుకున్నార‌ని, కానీ కొంత ఎక్కువ స‌మ‌యం ప‌ట్టింద‌ని వైద్యులు చెబుతున్నారు. ల‌క్ష‌ణాలు ఉన్న వారికి ప్ర‌తి మూడు గంట‌ల‌కు ఒక సారి ఐదు నిమిషాల పాటు ఆవిరి ప‌ట్ట‌గా వారం రోజుల్లో వారు సాధార‌ణ స్థితికి చేరుకున్నారని ఈ ప‌రిశోధ‌న చెబుతోంది. కొన్ని క్యాప్సూల్స్‌, విక్స్‌, అల్లం వంటివి వేసి ఆవిరి ప‌ట్టారు.

కాగా, ఇప్ప‌టికే మ‌న‌లో చాలా మంది క‌రోనా వైర‌స్ బారిన ప‌డ‌కుండా ముందు జాగ్ర‌త్తగా ఆవిరి తీసుకుంటున్నారు. వేడి నీటిఓ స్టీమ్ క్యాప్సూల్ లేదా విక్స్‌, ప‌సుపు వేసి చాలా మంది ఆవిరి తీసుకొని ఇక క‌రోనా నుంచి మేము సేఫ్ అనుకుంటున్నాము. ఇప్పుడు ముంబ‌యి వైద్యులు కూడా క‌రోనా పేషెంట్ల‌కు ఆవిరి బాగా ప‌ని చేసింద‌ని చెబుతున్నారు. అయితే, ఆవిరి పెట్టుకోవ‌డం వ‌ల్ల క‌రోనా వైర‌స్ చ‌నిపోతుంద‌న‌డానికి మాత్రం ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

ఆవిరితో క‌రోనా చ‌నిపోతుంద‌ని జ‌రుగుతున్న ప్ర‌చ‌రం త‌ప్ప‌ని, ఇందుకు శాస‌స్త్రీయ ఆధారాలు లేవ‌ని ప్రెస్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ స్ప‌ష్టం చేసింది. ప‌రిశుభ్ర‌త‌, సామాజ‌క దూరం పాటించ‌డం వంటివే క‌రోనా వైర‌స్ నుంచి కాపాడుతాయ‌ని చెప్పింది. అయితే, సాధార‌ణ జ‌లుబు నుంచి మాత్రం ఆవిరి చికిత్స కొంత వ‌ర‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తుంద‌ని, ముక్కులో ఎల‌ర్జీల‌ను దూరం చేస్తుంద‌ని మాత్రం వైద్యులు చెబుతున్నారు. ఈ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం లేదా ఐసీఎంఆర్ మ‌రింత స్ప‌ష్ట‌తనిస్తే బాగుంటుంది.

Related News