పెరిగిపోతున్న పెట్రోల్ ధరలతో ఇబ్బందులు పడుతున్న దేశప్రజలకు కొంత ఊరట కలిగిస్తూ పెట్రో ఉత్పత్తులపై కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన సంగతి తెలిసిందే. పెట్రోల్‌పైన రూ.8, డీజిల్‌పైన రూ.6 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో దేశంలో పెట్రోల్‌పైన రూ.9.50, డీజిల్‌పైన రూ.7 తగ్గింది.
కాగా, కేంద్రం బాటలోనే కొన్ని రాష్ట్రాలు కూడా పెట్రో ఉత్పత్తులపైన విధిస్తున్న వ్యాట్‌ను తగ్గిస్తున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత తగ్గుతున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం లీటరు పెట్రోల్‌పైన రూ.2.08, డీజిల్‌పైన రూ.1.44 తగ్గించింది. రాజస్థాన్‌లో పెట్రోల్‌పైన రూ.2.48, డీజిల్‌పైన రూ.1.16 తగ్గించారు. కేరళలో పెట్రోల్‌పైన రూ.2.41, డీజిల్‌పైన రూ.1.36 తగ్గించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం.